ద‌ర్శ‌న‌భాగ్యంతో కొత్త విష‌యాలు వెలుగులోకి..

New Things Come To Light With Vision, New Things Come, Light With Vision, Ayodhya, Baala Ramudu, Speciality Of Baalaramudu, Ayodhya New Things, Ayodhya Interesting Facts, Ayodhya Temple Facts, Ram Mandir Pran Pratishtha, Ram Mandir Inauguration, Latest Ayodya News, Ayodya News Updates, Mango News, Mango News Telugu
Ayodhya, Baala Ramudu, speciality of baalaramudu

అయోధ్య రామ‌య్య‌.. ల‌క్ష‌లాది మంది భ‌క్తుల నీరాజ‌నాలు అందుకుంటున్నారు. శ్రీ‌రామ స్ఫూర్తి భ‌జ‌న‌లు, ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. రామనామ స్మరణతో దేశం ఇంకా  మార్మోగుతూనే ఉంది. ఆ తాదాత్మ్యత నుంచి బయట పడలేదు.  ఎక్క‌డ చూసినా ఇంకా ఆధ్యాత్మికమే కనబడుతోంది. ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా అదే చర్చ. ఐదొందల ఏళ్లనాటి కల సాకారం కావడం.. ప్రధానమంత్రి మోదీ సంకల్పబలం గురించి ప్రజలు చెప్పుకుంటున్నారు. ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇచ్చిన తొలి రోజే 5 ల‌క్ష‌ల మంది రామ‌య్య‌ను ద‌ర్శించుకుని పుల‌కించారు. రెండో రోజూ భ‌క్తులు తండోప‌తండాలుగా వ‌స్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో అయోధ్యలో రామమందిరం గురించి, అయోధ్య విశేషాల గురించి ఎన్నో సంగతులు తెలుస్తున్నాయి. కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న ఆలయంలో కొలువైన బాల రామునికి సంబంధించిన కొత్త  సంగతులూ తెలుస్తున్నాయి. అయోధ్యలో  బాలరాముని దర్శిస్తే ఆయన  రామావతారంతో సహ శ్రీ మహా విష్ణువు దశావతారాలనూ దర్శించినట్లేననే అంశం తాజాగా వెల్లడైంది.  అదెలా అంటే ప్రాణ ప్రతిష్ట జరిగిన బాల రాముని  పక్కనున్న స్తంభాల్లో దశావతారాలు కూడా అవి ఉన్నాయి. ఏపక్కనున్న స్తంభంలో  ఏ అవతారాలున్నాయో కొన్ని విశేషాలు వివరాలిలా ఉన్నాయి.

కుడివైపు: పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి.

ఎడమ వైపు : మత్స్య, కూర్మ,వరాహ, నరసింహ, వామన.

అంతేకాదు.. బాలరాముని విగ్రహాన్ని కలువపై ప్రతిష్టించగా, ఆర్చిలో స్వస్తిక్, ఓమ్, సూర్యనారాయణలు కూడా ఉన్నారు.

మ‌రికొన్ని విశేషాలు

బాలరాముని ఆభరణాల్లో వజ్రాలు, పచ్చలు, కెంపులు, తదితరమైనవి ఎన్నో ఉన్నాయి. 18567  వజ్రాలు, 2984 కెంపులు, 615 పచ్చలతో పాటు  439 అన్‌కట్‌  వజ్రాలు కూడా ఉన్నాయి. 1.7 కేజీల బంగారుకిరిటంలోనూ ఎన్నో ఆభరణాలున్నాయి. వీటన్నింటినీ ధరించిన బాలరాముడి విగ్రహం

ఎత్తు: 4.24 అడుగులు, వెడల్పు:3 అడుగులు  బరువు: 200 కిలోలు

అయోధ్య రామ మందిరం పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి, పర్యావరణ నీటి సంరక్షణపై దృష్టి సారించి నిర్మించబడింది. 2022లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం అంచనా వేసినట్లుగా రామ మందిర నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 1,800 కోట్లు. ఫిబ్రవరి 5, 2020 మరియు మార్చి మధ్య నిర్మాణానికి రూ. 900 కోట్లు ఖర్చు చేసినట్లు గత ఏడాది అక్టోబర్‌లో పిటిఐ నివేదిక సూచించింది. పూర్తి స్థాయి క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఇంకా ప‌నులు కొన‌సాగుతున్నాయి. వాటికి మ‌రో రూ. 300 కోట్ల వ‌ర‌కూ వ్య‌యం అవుతుంద‌ని ట్ర‌స్ట్ స‌భ్యులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − six =