ఇకపై విదేశీ ప్రయాణికులకు 7రోజుల క్యారంటైన్‌ అవసరం లేదు – కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

7-Day Quarantine For Foreign Travellers, 7-day quarantine india, Entry restrictions for foreigners, Good news for travellers arriving in India, Govt Eases Covid Rules, india quarantine rules for fully vaccinated, india quarantine rules from uk, india quarantine rules from usa, Indian Govt Eases Covid Rules, latest guidelines for international passengers arriving in india, latest guidelines for international passengers arriving in india 2022, latest guidelines for international passengers arriving in india from usa, Mango News, new guidelines for covid, New Rules For Foreign Arrivals, No More 7-Day Quarantine For Foreign Travellers, No More 7-Day Quarantine For Foreign Travellers as Govt Eases Covid Rules, Quarantine For Foreign Travellers, Quarantine For International Passengers

విదేశీ ప్రయాణాలు చేసేవారికి శుభవార్త. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 7రోజుల క్యారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు 14 రోజుల స్వీయ పర్యవేక్షణ ఉండాలని సూచించింది. ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అయితే, ఇది కేవలం ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రమాదం లేని దేశాల నుంచి రాకపోకలు సాగించే వారికి మాత్రమే అని పేర్కొంది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

విదేశీ ప్రయాణికులకు కేంద్రం సవరించిన కొత్త మార్గదర్శకాలు

  • విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులు ‘ఎయిర్ సువిధ పోర్టల్ లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఫిల్ చేయాలి.
  • విదేశీయులందరూ తప్పనిసరిగా గత 14 రోజుల ప్రయాణ చరిత్రతో సహా ఆన్‌లైన్‌లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాలి.
  • ప్రయాణికులు తప్పనిసరిగా ప్రయాణ తేదీకి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్ లో నెగటివ్ రిజల్ట్ ను అప్‌లోడ్ చేయాలి.
  • రెండు డోసుల వ్యాక్సిన్‌లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి.
  • ప్రయాణ సమయంలో ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారిని ఐసోలేషన్లో ఉంచాలి.
  • వ్యాక్సిన్‌ ప్రోగ్రాంలో భాగంగా భారత్‌ నిర్దేశించిన 72 దేశాల వారికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి.
  • విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులందరూ 14 రోజులపాటు స్వీయ పర్యవేక్షణలో ఉండాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =