మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటన: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్‌ సెంటర్‌లు ప్రారంభం

Minister KTR Inaugurates Several Developmental Works in Jagtial Today, Telangana Minister KTR Inaugurates Several Developmental Works in Jagtial Today, KTR Inaugurates Several Developmental Works in Jagtial Today, Minister KTR Launches Several Developmental Works in Jagtial Today, Minister KTR Inaugurated Several Developmental Works in Jagtial Today, Several Developmental Works in Jagtial, Minister KTR Jagtial Tour, Minister KTR Jagtial Tour News, Minister KTR Jagtial Tour Latest News, Minister KTR Jagtial Tour Latest Updates, Minister KTR Jagtial Tour Live Updates, Developmental Works, Jagtial Developmental Works, Jagtial, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా జిల్లాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. మొత్తం 110 ఇళ్లలో లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు మంత్రి కేటీఆర్‌. అనంతరం మెట్‌పల్లిలో నిరుద్యోగ యువతకోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. నిరుద్యోగులు పట్టుదలతో చదివితే ఉద్యోగాలు సాధించడం పెద్ద కష్టమైన పనేం కాదని, ప్రణాళికాబద్ధంగా చదువును కొనసాగించాలని సూచించారు. ఇక ఉద్యోగాల పరంగా.. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, అందులో 95 శాతం స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు వచ్చేలా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారని, తాజాగా మరో 90 వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. ఇక జగిత్యాల జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నామని, దీనిలో భాగంగా ధాత్రి, భువి వంటి పెద్ద కంపెనీలు ప్రాసెసింగ్‌ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. అలాగే ప్రైవేటు రంగంలో 19 వేల పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయని, అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఈ 8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదమైన ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ అమలు దిశగా అడుగులు వేస్తున్నామని, దీనికి అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో కోటి ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి మంచినీరు అందిస్తోందని వెల్లడించారు. నీళ్ల విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.45 వేల కోట్లు ఖర్చుచేసి ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం నాలుగేళ్ల కాలంలోనే పూర్తిచేశామని వెల్లడించారు. దీనిద్వారా 90 లక్షల ఎకరాలకు నీళ్లివ్వవచ్చని, దీనిద్వారా 82 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 1 =