పీఎం-కిసాన్ పై కేంద్రం కీలక నిర్ణయం, ఈ-కేవైసీ గడువు జూలై 31 వరకు పొడిగింపు

PM Kisan Samman Nidhi Centre Extends eKYC Deadline till July 31, Centre Extends eKYC Deadline till July 31, Centre Govt Extends eKYC Deadline till July 31, government has now further extended the deadline to complete eKYC for beneficiary farmers of PM Kisan, Deadline of eKYC for all the PMKISAN beneficiaries has been extended till 31st July 2022, Deadline of eKYC, Deadline of eKYC Extends, PM Kisan eKYC Deadline Extended, PM Kisan eKYC deadline extends, Centre extends PM Kisan eKYC deadline, extended the deadline for completing the obligatory eKYC till July 31 2022, PM Kisan eKYC, Date to complete mandatory PM Kisan eKYC extended again, PM Kisan Samman Nidhi News, PM Kisan Samman Nidhi Latest News, PM Kisan Samman Nidhi Latest Updates, PM Kisan Samman Nidhi Live Updates, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క నగదు పొందేందుకు లబ్ధిదారులైన రైతులకు కేంద్రప్రభుత్వం 2022-23 ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ-కేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఈ-కేవైసీ పూర్తిచేసేందుకు మార్చి 31, 2022 వరకు గడువు పెట్టగా, రైతుల నుంచి స్పందన అంతగా లేకపోవడంతో గడువును మే 31, 2022 వరకు పొడిగించారు. కాగా ఈ-కేవైసీ విషయంలో కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ ఖాతా ఈ-కేవైసీని పూర్తిచేసేందుకు గడువును జూలై 31, 2022 వరకు పొడిగిస్తునట్టు ప్రకటించింది. ఆ వివరాలను పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

“పీఎం కిసాన్ నమోదిత రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి. పీఎంకిసాన్ పోర్టల్‌లో ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం సమీపంలోని సీఎస్సీ కేంద్రాలను సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ గడువు జూలై 31, 2022 వరకు పొడిగించబడింది” అని ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పీఎం కిసాన్ కింద 11వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ మే 31న విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 10 కోట్లమందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున జమ అయ్యేలా దాదాపు రూ.21,000 కోట్ల నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.

పీఎం కిసాన్ కోసం ఈ-కేవైసీ ప్రక్రియ:

  • పీఎం కిసాన్ వెబ్ సైట్ ను http://pmkisan.nic.in/ని సందర్శించి, ఫార్మర్స్ కార్నర్ విభాగం కింద ‘ఈ-కేవైసీ’పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ పేజీలో ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • ఆధార్ నెంబర్ కనిపించాక, ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, గెట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేయాలి.
  • మొబైల్ నంబర్‌ కు వచ్చిన నాలుగు అంకెల ఓటీపీని ఎంటర్ చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఆధార్ రిజిస్టర్డ్ ఓటీపీ ఆప్షన్ లో క్లిక్ చేసాక మొబైల్ నెంబర్ కు వచ్చిన మరో ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ-కేవైసీ విజయవంతంగా పూర్తవుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 15 =