పుట్టిన రోజున వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన మోడీ

#HappyBdayPMModi, #happybirthdaynarendramodi, #HappyBirthdayPM, latest political breaking news, Mango News Telugu, Modi Celebrates His 69th Birthday In Gujarat, national news headlines today, national news updates 2019, National Political News 2019, PM Modi Celebrates His 69th Birthday, PM Modi Celebrates His 69th Birthday In Gujarat, PM Narendra Modi Celebrates His 69th Birthday In Gujarat, Prime Minister Narendra Modi

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు 69వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, క్రికెటర్లు, అభిమానులు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు నాడు మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ వెళ్లి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని సందర్శించారు. నిన్నరాత్రే గుజరాత్ చేరుకున్న మోడీ, ఈ రోజు ఉదయం గాంధీనగర్ నుంచి కేవడియా వెళ్లి వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హెలికాఫ్టర్ నుంచి తీసిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

విగ్రహ సందర్శన తరువాత మోడీ బటర్‌ఫ్లై గార్డెన్‌ను సందర్శించారు. అనంతరం నమామీ నర్మద కార్యక్రమంలో పాల్గొన బోతున్నారు. సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద మోడీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రజనుద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుజరాత్ లోని తన ఇంటికి వెళ్లి , పుట్టిన రోజు సందర్భంగా తల్లి హిరాబెన్ ఆశీస్సులు తీసుకోనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో పాటు పలువురు ప్రముఖులు మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 20 =