నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బోలా అహ్మద్ టినుబుకు ప్రధాని మోదీ అభినందనలు

PM Modi Congratulates Bola Ahmed Tinubu For Winning The Presidential Elections In Nigeria,PM Modi Congratulates Bola Ahmed Tinubu,Bola Ahmed Tinubu Wins The Presidential Elections,Presidential Elections In Nigeria,Mango News,PM Modi Congratulates Nigerias Bola Ahmed,PM Modi Congratulates Nigerias, President,PM Congratulates H.E. Mr. Bola Ahmed Tinubu,2023 Presidential Election Results,Nigerian Presidential Election 2023,Nigeria'S Bola Tinubu Declared Winner,Nigeria Latest News And Updates,Nigeria Elections Live News

నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బోలా అహ్మద్ టినుబుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు బోలా అహ్మద్ టినుబును నేను అభినందిస్తున్నాను. మీ నాయకత్వంలో భారత్-నైజీరియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నారు.

ముందుగా నైజీరియా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడుని ఎన్నుకోవడానికి నైజీరియా 2023 అధ్యక్ష ఎన్నికలు 2023, ఫిబ్రవరి 25న జరిగాయి. కాగా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చి 1న ప్రకటించారు. లాగోస్ స్టేట్ మాజీ గవర్నర్ మరియు ఆల్ ప్రోగ్రెసివ్ కాంగ్రెస్ నామినీ అయిన బోలా అహ్మద్ టినుబు నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో 36.61% ఓట్ల సాధించి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రత్యర్థి అతికు అబుబకర్ (29% ఓట్లు), లేబర్ పార్టీ అభ్యర్థి పీటర్ ఓబీ (25% ఓట్లు)పై గెలుపొందారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 5 =