కర్నాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్

CM KCR Sanctions Rs 5 Cr for Renovation of Karnataka Sahitya Mandira in Kachiguda in Hyderabad,CM KCR Sanctions Rs 5 Cr,Renovation of Karnataka Sahitya Mandira,Karnataka Sahitya Mandira Kachiguda,Karnataka Sahitya Mandira Hyderabad,Mango News,Mango News Telugu,Hyderabad Karnataka Sahitya Mandira,Karnataka Sahitya Mandira,Karnataka Sahitya Mandira Latest News,Karnataka Sahitya Mandira Sanction,Karnataka Sahitya Mandira Updates,Karnataka Sahitya Mandira Latest News and Updates,Telangana CM KCR

హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్ధాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని, వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్ కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కన్నడిగుల కోసం హైదరాబాద్ లో గల సాహిత్య వేదికను పునరుద్ధరించాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న కర్నాటక వాసులు మరియు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజ్జప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్ కాచిగూడలో గల ‘కర్నాటక సాహిత్య మందిర’ పునర్నిర్మాణం కోసం రూ. 5 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను, అధికారులను సీఎం ఆదేశించారు. సాహిత్య, సాంస్కృతక కార్యక్రమాలతో పాటు కమ్యునిటీ అవసరాల కోసం వినియోగించుకునే విధంగా మౌలికవసతులను ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేకు సీఎం సూచించారు. కాగా తన విజ్జప్తి మేరకు రూ.5 కోట్లను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం ప్రగతి భవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =