టోక్యో ఒలింపిక్స్‌ లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లకు బీసీసీఐ నగదు నజరానా

bcci, BCCI Announced Cash Rewards for Tokyo Olympics Medal Winners, BCCI Announces Cash Prize For India’s Tokyo 2020 Olympic Winner, BCCI announces cash reward for Olympic medal winners, BCCI Cash Rewards for Tokyo Olympics Medal Winners, Cash Rewards for Tokyo Olympics Medal Winners, Mango News, Tokyo Olympics, Tokyo Olympics 2020, Tokyo Olympics 2020 Live, Tokyo Olympics 2020 LIVE Updates, Tokyo Olympics Live Updates, Tokyo Olympics Medal Winners, Tokyo Olympics News, Tokyo Olympics Updates

టోక్యో ఒలింపిక్స్‌-2020లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈసారి ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సహా మొత్తం ఏడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నగదు నజరానా ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా శనివారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. అథ్లెట్ల అద్భుతమైన ప్రయత్నాలను గుర్తిస్తూ, పతక విజేతలకు నగదు బహుమతులను ప్రకటించడం సంతోషంగా ఉందని జైషా తెలిపారు.

ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్రాకు కోటి రూపాయలు నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది. రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్ రవి కుమార్ దాహియాకు రూ.50 లక్షలు అందించనున్నట్టు తెలిపారు. అలాగే కాంస్య పతకాలు సాధించిన బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, రెజ్లర్ బజరంగ్‌ పూనియా, బాక్సర్ లవ్లీనా బొర్గోహేన్‌ లకు రూ.25 లక్షలు చొప్పున ప్రకటించారు. ఇక 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ లో కాంస్యం కైవసం చేసుకున్న భారత హాకీ జట్టుకు రూ.1.25 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here