డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ e-RUPI ని ప్రారంభించిన ప్రధాని మోదీ

Cashless And Contactless e-RUPI Digital Payment Mode, Cashless And Contactless e-RUPI Digital Payment Mode For Government Welfare Schemes, Cashless And Contactless e-RUPI Digital Payment Mode For Government Welfare Schemes In India, DNA Explainer, e-RUPI Launch By PM Modi, Government Welfare Schemes, India to get new digital payment mode with launch of e-RUPI, Mango News, new digital payment mode in India, PM Modi, PM Modi Launch Cashless And Contactless e-RUPI Digital Payment Mode For Government Welfare Schemes In India, RUPI Digital Payment Mode, RUPI Digital Payment Mode For Government Welfare Schemes

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 2, సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ ‘ఈ-రూపీ’ (e-RUPI)ని ప్రారంభించారు. ప్రీపెయిడ్ ఈ-ఓచర్ అయిన ఈ-రూపీ ద్వారా క్యాష్ లెస్ (నగదు రహిత), కాంటాక్ట్ లెస్ డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఇది లబ్ధిదారుల మొబైల్‌ ఫోన్లకు క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ తో ముడిపడిన ‘ఈ-ఓచర్’ గా పంపబడుతుంది. సర్వీస్ స్పాన్సర్‌ లను మరియు లబ్ధిదారులను ఈ-రూపీ డిజిటల్‌గా కనెక్ట్ చేయనుంది. సర్వీస్ ప్రొవైడర్ వద్ద కార్డ్, డిజిటల్ పేమెంట్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ అవసరం లేకుండా వినియోగదారులు ఈ-ఓచర్ ను రీడీమ్ చేసుకోగలుగుతారు. దీనిని ఆర్థిక సేవల విభాగం, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ సహకారంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది.

అలాగే ఈ-రూపీ సర్వీస్ స్పాన్సర్‌లను ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం లేకుండా లబ్ధిదారులతో, సర్వీస్ ప్రొవైడర్లతో అనుసంధానం చేస్తుంది. అంతే కాకుండా లావాదేవీ పూర్తయిన తర్వాత మాత్రమే సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లింపు జరుగుతుంది. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సంక్షేమ సేవల అందించడానికి భరోసా దిశగా ఇదొక విప్లవాత్మక కార్యక్రమం కాగలదని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా ఔషధాలు, పౌష్టికాహార మద్దతునిచ్చే మాతా-శిశు సంక్షేమ పథకాలతోపాటు టీబీ నిర్మూలన కార్యక్రమాలు, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన కింద మందులు-రోగ నిర్ధారణ పరీక్షల కోసం, ఎరువుల రాయితీలు వంటి సేవలకూ ఈ-రూపీని ఉపయోగించే వీలుంటుంది. అలాగే ప్రైవేటు రంగం కూడా తమ ఉద్యోగుల సంక్షేమ, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల కోసం కూడా ఈ డిజిటల్ ఓచర్లను వినియోగించుకోవచ్చుని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశంలో డిజిటల్ లావాదేవీలలో డీబీటీని మరింత ప్రభావవంతంగా మార్చడంలో ఈ-రూపీ వోచర్ భారీ పాత్ర పోషించబోతోందని చెప్పారు. అలాగే డిజిటల్ గవర్నెన్స్‌కు కొత్త కోణాన్ని అందిస్తుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల జీవితాలను అనుసంధానించడం ద్వారా భారతదేశం ఎలా పురోగమిస్తుందో ఈ-రూపీ ఒక చిహ్నమని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75వ వార్షికోత్సవం సందర్భంగా దేశం అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఈ భవిష్యత్ సంస్కరణ అందుబాటులోకి రావడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =