నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

airport in Uttar Pradesh, Asia’s largest airport, Foundation Stone of Noida International Airport, international airport in Uttar Pradesh, largest international airport in Asia, Mango News, Noida, Noida International Airport, Noida International Airport Inauguration, Noida International Airport Inauguration LIVE Updates, pm narendra modi, PM Narendra Modi Lays the Foundation Stone of Noida International Airport, Prime Minister Narendra Modi, Uttar Pradesh, Uttar Pradesh Chief Minister, Yogi Adityanath

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గౌతమ్ బుద్ధ నగర్‌లోని జెవార్‌లో నిర్మించనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఎన్ఐఏ) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ వీకే సింగ్, సంజీవ్ బలియన్, ఎస్పీ సింగ్ బఘేల్, బీఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయంగా ఇది నిర్మాణం కాబోతుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, 21వ శ‌తాబ్దపు కొత్త భార‌త‌దేశం నేడు అత్యుత్త‌మ ఆధునిక మౌలిక స‌దుపాయాల‌తో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంద‌ని అన్నారు. మెరుగైన రోడ్లు, మెరుగైన రైలు నెట్‌వర్క్, మెరుగైన విమానాశ్రయాలు కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మాత్రమే కాదు, అవి మొత్తం ప్రాంతాన్ని, ప్రజల జీవితాలను పూర్తిగా మారుస్తాయన్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తర భారతదేశానికి లాజిస్టిక్స్ గేట్‌వేగా మారుతుందని చెప్పారు. విమానాశ్రయం సజావుగా నడపడానికి వేలాది మంది ప్రజలు అవసరం, అందువల్ల ఈ విమానాశ్రయం పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లోని వేలాది మందికి కొత్త ఉపాధిని కూడా ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మొత్తం రూ.10,050 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ విమానాశ్రయం యొక్క మొదటి దశ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ విమానాశ్రయం 1300 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉండగా, మొదటి దశ పూర్తయిన అనంతరం సంవత్సరానికి 1.2 కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్టు జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ సంస్థకు దక్కగా, మొదటిదశ పనులు 2024 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇది ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రెండో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కానుంది. అలాగే దేశంలో ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవతరించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 14 =