సెప్టెంబర్ 29, 30 తేదీల్లో గుజరాత్‌ రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Narendra Modi will Visit Gujarat on 29th and 30th September, Prime Minister Modi Gujarat Tour on September 29 and 30, Prime Minister Modi Gujarat Tour, Prime Minister Gujarat Tour, PM Narendra Modi will Visit Gujarat, Mango News, Mango News Telugu, PM Modi Gujarat Tour, Modi Tour To Gujarat, Gujarat Latest News And Updates, PM Modi Tour Live Updates, PM Narendra Modi Gujarat Tour, National News, National Politics

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 29, 30 తేదీల్లో గుజరాత్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబ‌ర్ 29, గురువారం తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు సూరత్‌ లో రూ.3400 కోట్లు కంటే ఎక్కువ విలువైన వివిధ ప్రాజెక్టుల‌కు ప్రధాని మోదీ శంకుస్థాప‌నలు, ప్రారంభోత్సవాలు చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత ప్ర‌ధాని మోదీ భావ్ న‌గ‌ర్ కు చేరుకొని అక్కడ మధ్యాహ్నం 2 గంటలకు, 5200 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాప‌నలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక గురువారం రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను ప్రధాని ప్రారంభిస్తారు. రాత్రి 9 గంటలకు అహ్మదాబాద్‌లోని జీఏండీసీ గ్రౌండ్‌లో జరిగే నవరాత్రి ఉత్సవంలో ప్రధాని పాల్గొంటారు.

అలాగే సెప్టెంబరు 30, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు గాంధీనగర్ స్టేషన్‌లో గాంధీనగర్-ముంబయి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించి, అక్కడి నుండి కలుపూర్ రైల్వే స్టేషన్‌కు రైలులో ప్రయాణిస్తారు. ఉదయం 11:30 గంటలకు, అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రధాని జెండా ఊపి ప్రారంభించి, కలుపూర్ స్టేషన్ నుండి దూరదర్శన్ కేంద్ర మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైడ్ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అహ్మదాబాద్‌లోని అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీలో జరిగే బహిరంగ కార్యక్రమంలో అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్-1ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:45 గంటలకు అంబాజీలో రూ.7200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన చేయడంతో పాటు, పూర్తయిన మరికొన్నింటిని జాతికి అంకితం చేస్తారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు అంబాజీ ఆలయాన్ని ప్రధాని దర్శించి, పూజలు చేస్తారు. ఆ తర్వాత రాత్రి 7:45 గంటలకు గబ్బర్ తీర్థంలో జరిగే మహా ఆరతి కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. ఈ మేరకు ప్రధానిమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here