ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోడీ

Independence Day, Independence Day 2019, Independence Day News, Mango News Telugu, Modi Hoisted The National Flag, Narendra Modi, Narendra Modi Hoisted The National Flag, PM Modi, PM Modi Hoisted The National Flag, Prime Minister Narendra Modi, Prime Minister Narendra Modi Hoisted, Prime Minister Narendra Modi Hoisted The National Flag

భారత దేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం తన నివాసం నుంచి బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీనుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ వేడుకకు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, మరియు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్య్రం అని చెప్పారు. స్వాతంత్య్రం కోసం కృషి చేసిన అనేక మంది త్యాగధనులకు కృతజ్ఞతలు తెలిపారు. అమర వీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికి గుర్తించుకుంటారని చెప్పారు. ప్రజల కిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, వారి ఆకాంక్షల మేరకు చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే ఆర్టికల్-370 రద్దు చేశామని, వల్లభాయ్ పటేల్ కలని సాకారం చేశామని పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన 10 వారాల్లోనే దేశం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాల గురించి ఈ ప్రసంగంలో ప్రధాని మోడీ ప్రజలకు వివరించారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here