పంజాబ్: ‘ఆప్’ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ప‌ద్మశ్రీ అవార్డు గ్ర‌హీత‌ల‌కు రాజ్య‌స‌భ టికెట్లు కేటాయింపు

Punjab AAP Nominates Padma Shri Awardees Balbir Singh Seechewal and Vikramjit Singh Sahney For Rajya Sabha Polls, AAP Nominates Padma Shri Awardees Balbir Singh Seechewal and Vikramjit Singh Sahney For Rajya Sabha Polls, Padma Shri Awardees Balbir Singh Seechewal and Vikramjit Singh Sahney For Rajya Sabha Polls, Padma Shri Awardee Vikramjit Singh Sahney For Rajya Sabha Polls, Padma Shri Awardee Balbir Singh Seechewal For Rajya Sabha Polls, Punjab AAP Nominates Padma Shri Awardees, Vikramjit Singh Sahney, Balbir Singh Seechewal, AAP fields two Padma Shree awardees for Rajya Sabha polls, Rajya Sabha polls, Punjab Rajya Sabha polls, Punjab AAP Nominates Padma Shri Awardees For Rajya Sabha polls, Punjab AAP has nominated Padma Shri awardees Balbir Singh Seechewal and Vikramjit Singh Sahney For Rajya Sabha Polls, Punjab Rajya Sabha polls News, Punjab Rajya Sabha polls Latest News, Punjab Rajya Sabha polls Latest Updates, Punjab Rajya Sabha polls Live Updates, Mango News, Mango News Telugu,

ఆమ్ ఆద్మీ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పార్టీ తరపున ఇద్దరు ప్రముఖ వ్యక్తులు బల్బీర్ సింగ్ సీచెవాల్ మరియు విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీలను పార్టీ నామినీలుగా నిర్ణయించింది. వీరిద్దరూ రాజకీయాలకు పూర్తిగా సంబంధం లేనివారు కావడం, అంతేకాకుండా ప‌ద్మశ్రీ అవార్డు గ్ర‌హీత‌లు కూడా కావడం విశేషం. పంజాబ్ విధానసభలో ప్రతిపక్ష పార్టీలకు సమిష్టిగా కూడా తమ సొంత అభ్యర్థులను బలపరిచేందుకు అవసరమైన సంఖ్యాబలం లేనందున, రాజ్యసభకు వారి ఎన్నిక లాంఛనమే కానుంది. దీంతో రాజ్యసభలో పార్టీ బలం మొత్తంగా 10 కి చేరుకోనుంది.

వీరిద్దరు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. జూన్ 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత, కాంగ్రెస్‌కు రాష్ట్రం నుండి ఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరూ లేకపోవడం ఇదే మొదటిసారి. పంజాబ్ నుంచి అంబికా సోనీ (కాంగ్రెస్), బల్వీందర్ సింగ్ భుందర్ (శిరోమణి అకాలీదళ్) రాజ్యసభ సభ్యుల పదవీకాలం జూలై 4తో ముగియనుండగా, వీరి స్థానంలో ఆప్ పార్టీ బల్బీర్ సింగ్ మరియు విక్రమ్‌జిత్ సింగ్ లను పంపనుంది. కాగా పర్యావరణ ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా జీవితంలో అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తిగా బల్బీర్ సింగ్ సీచెవాల్ కు మంచి గుర్తింపు ఉంది. అలాగే పంజాబీ సంస్కృతి ప‌రిర‌క్ష‌ణలో ముందుండే ప్రముఖ పారిశ్రామికవేత్తగా విక్ర‌మ్ జిత్ సింగ్ సాహ్నికి మంచి గుర్తింపు ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =