పంజాబ్‌: కాల్పుల్లో మరణించిన ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ‘సిద్ధూ మూసేవాలా’ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ

Punjab Rahul Gandhi Meets Slain Singer and State Congress Leader Sidhu Moose Wala's Family, Rahul Gandhi Meets Slain Singer and State Congress Leader Sidhu Moose Wala's Family, Rahul Gandhi Meets Slain Singer Sidhu Moose Wala's Family, Rahul Gandhi Meets Punjab State Congress Leader Sidhu Moose Wala's Family, Rahul Gandhi Meets Sidhu Moose Wala's Family, Congress MP Rahul Gandhi met with murdered singer-politician Sidhu Moose Wala's family, singer-politician Sidhu Moose Wala's family, Sidhu Moose Wala's family, Congress MP Rahul Gandhi, MP Rahul Gandhi, Rahul Gandhi, Congress leader Rahul GandhI, Rahul Gandhi met the family of slain Punjabi singer Shubhdeep Singh Sidhu, slain Punjabi singer Shubhdeep Singh Sidhu, Mango News, Mango News Telugu,

పంజాబ్‌లో ఇటీవల దుండగుల కాల్పుల్లో మరణించిన ప్రముఖ పంజాబీ గాయకుడు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ‘సిద్ధూ మూసేవాలా’ కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కలిశారు. మంగళవారం పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని ‘మూసేవాలా’ ఇంటికి వచ్చిన రాహుల్ గాంధీ ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఈ రోజు చండీగఢ్ విమానాశ్రయం నుండి కారులో నేరుగా వారి స్వగ్రామం మూసాకు వెళ్లి ఆయన కుటుంబంతో దాదాపు 50 నిమిషాలు గడిపారు. ముందుగా ఇంటిలోని మూసేవాలా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్, పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు పర్తాప్ సింగ్ బజ్వా, మాజీ ఉప ముఖ్యమంత్రి ఒపి సోనీ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయన వెంట ఉన్నారు.

అనంతరం రాహుల్ గాంధీ శాంతిభద్రతలపై భగవంత్ మాన్ నేతృత్వంలోని ‘ఆప్’ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. దీనిపై ట్విట్టర్ ద్వారా సూటిగా విమర్శలు సంధించారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంజాబ్‌లో శాంతి మరియు ప్రశాంతతను కాపాడటం ఆప్ ప్రభుత్వ సామర్థ్యానికి మించినది’ అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు. అలాగే ‘కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా జీ తల్లిదండ్రులు పడుతున్న బాధను వర్ణించడం కష్టంగా ఉంది, వారికి న్యాయం చేయడం మా కర్తవ్యం’ అని పేర్కొన్నారు. కాగా రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో మూసేవాలా నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. మే 29న మాన్సాలో మూసేవాలాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య జరిగినప్పుడు రాహుల్ గాంధీ విదేశాల్లో ఉండి, వారాంతంలో తిరిగి వచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 9 =