మహారాష్ట్రలో 1-8 తరగతుల విద్యార్థులకు పరీక్షలు రద్దు, పైతరగతులకు ప్రమోట్

Maharashtra Govt Cancels Exams for 1 to 8 Class Students, All Students to be Promoted

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1 నుంచి 8 తరగతుల వరకు విద్యార్థుల పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ శనివారం నాడు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఒక వీడియో విడుదల చేశారు. “ప్రస్తుతం నెలకున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా, మహారాష్ట్రలోని 1 వ తరగతి నుండి 8 వతరగతి వరకు ఉన్నస్టేట్ బోర్డు విద్యార్థులందరూ ఎటువంటి పరీక్షలు లేకుండా తదుపరి తరగతికి ప్రమోట్ చేయబడతారు. 9, 11 తరగతుల విద్యార్థుల పరీక్షలకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకోబడుతుంది” అని విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 8 =