పవర్ ఫుల్ హామీలతో టీడీపీ, జనసేన మేనిఫెస్టో

Manifesto of TDP and Janasena with Powerful Promises,Manifesto of TDP and Janasena,TDP and Janasena with Powerful Promises,Manifesto with Powerful Promises,Mango News,Mango News Telugu,Pawan kalyan, chandrababu naidu, TDP, Janasena, AP politics,TDP and Janasena Latest News,Manifesto of TDP Latest News,Manifesto of TDP Live Updates,Manifesto of Janasena Latest News,Manifesto Powerful Promises Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
Pawan kalyan, chandrababu naidu, TDP, Janasena, AP politics

వైసీపీని గద్దె దించడమే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే జనాలను ఆకట్టుకునేందుకు రెండుసార్లు టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. కానీ ఆ మేనిఫెస్టోలు జనాలను కట్టిపడేయడంలో ఫెయిల్ అయ్యాయి. దీంతో పవన్, చంద్రబాబు రూట్ మార్చేశారు. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో గెలుపొందిన పార్టీల మేనిఫెస్టోలను తీసుకొని.. కొత్త మేనిఫెస్టో రూపొందించాలని భావిస్తున్నారు. సీఎం జగన్ ఇప్పటి వరకు అమలు చేసిన హామీల కన్నా.. పవర్ ఫుల్ హామీలను గుప్పించాలని పావులు కదుపుతున్నారు.

తెలంగాణలో సరికొత్త పథకాలను తీసుకొచ్చి జనాలను ఆకట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీలతో గ్రాండ్ సక్సెస్ అయింది. ఏకంగా అధికారాన్నే చేజిక్కించుకుంది. ఈక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని.. కొన్ని హామీలను తీసుకొని సరికొత్త మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అలాగే ఎన్నికల వేళ కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాలను పరిశీలిస్తూ.. ఎన్నికల ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ రైతు రుణమాఫీని ప్రకటించినట్లుగానే.. ఏపీలో కూడా ఆ హామీని ప్రకటించాలని పవన్, చంద్రబాబు భావిస్తున్నారు. ఈ హామీ ద్వారా రైతులను తమ వైపు తిప్పుకోవచ్చని.. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టడానికి ఈ హామీ దివ్యాస్త్రంగా ఉపయోగపడుతుందని నేతలు భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ జనాల్లోకి చొచ్చుకుపోయింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఈ హామీ కీలకంగా మారింది. దీంతో ఈ హామీని కూడా మేనిఫెస్టోలో చేర్చాలని భావిస్తున్నారు. ఇలా పవర్ ఫుల్ హామీలతో మేనిఫెస్టో రూపొందించి జగన్‌ను ఎదుర్కోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు.

అలాగే ఇన్నిరోజుల పాటు వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో కొంత సానుకూలత కనిపంచడంతో ఇప్పుడు రూట్ మార్చేశారు. వైసీసీ పాజిటివ్ ఓట్లపై కన్నేశారు. వైసీపీ అనుకూల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + thirteen =