జైలు నుంచి విడుదలైన షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌

Arthur Road Jail, Aryan Khan Case, Aryan Khan Case LIVE, Aryan Khan Case News, Aryan Khan Drugs Case LIVE Updates, Aryan Khan granted bail in drugs case by Bombay High Court, Aryan Khan Released, Aryan Khan Released from Arthur Road Jail, Bombay HC grants bail to Aryan Khan, Bombay High Court, Mango News, Narcotics-on-cruise Case, Shah Rukh Khan, Shah Rukh Khan Son Aryan Khan, Shah Rukh Khan’s Son Aryan Khan Released from Arthur Road Jail, Shahrukh Khan’ Son Aryan Khan

ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కు అక్టోబర్ 28న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన దాదాపు నెల రోజుల తర్వాత ఆర్యన్ ఖాన్ శనివారం ఉదయం ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు వెలుపల షారుఖ్ ఖాన్ సెక్యూరిటీ హెడ్ ఆర్యన్ ఖాన్‌ కు స్వాగతం పలికారు. అనంతరం మూడు కార్ల కాన్వాయ్ తో ఆర్యన్ ఖాన్‌ తన నివాసమైన మన్నత్‌ కు చేరుకున్నాడు. మన్నత్ వెలుపల ఆర్యన్ ఖాన్ కు స్వాగతం చెప్పేందుకు షారుఖ్ అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. మరోవైపు ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైలు నుంచి ఆర్యన్ ఖాన్‌ విడుదల అయిన సమయంలో భారీగా అభిమానులు, ప్రజలు గుమిగూడడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో ముంబయి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ముందుగా ఈ కేసులో ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాలకు 14 షరతులతో కూడిన బెయిల్ ను బాంబే హైకోర్టు మంజూరు చేసింది. రూ.1 లక్ష వ్యక్తిగత బాండ్‌, పాస్‌పోర్ట్‌లను సరెండర్ చేయడంతో పాటుగా, ప్రత్యేక ఎన్‌డిపిఎస్‌ కోర్టు అనుమతి తీసుకోకుండా దేశం విడిచి వెళ్లరాదని, అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఎన్‌సీబీ కార్యాలయంలో హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + five =