రాముడి జీవితం ఉట్టిపడేలా 100 విగ్రహాలతో శోభాయాత్ర

Shobhayatra with 100 Idols to Celebrate Ramas Life,Shobhayatra with 100 idols,Idols to Celebrate Ramas Life,Shobhayatra with idols,Prime Minister Modi laid the foundation stone, Ayodhya Ram Temple, dedication ceremony of the Ram Mandir, Ayodhya,Mango News,Mango News Telugu,Shobhayatra Latest News,Shobhayatra Latest Updates,Shobhayatra Live News,Ayodhya Ram Temple Latest News,Ayodhya Ram Temple Latest Updates
Shobhayatra with 100 idols,Prime Minister Modi laid the foundation stone, Ayodhya Ram Temple, dedication ceremony of the Ram Mandir, Ayodhya,

అయోధ్య రామమందిరానికి  2020 ఆగస్టులో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన మూడేళ్ల తర్వాత, అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక తేదీని ట్రస్టీ నిర్వాహకులు జనవరి 22, 2024గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని  కొత్తగా నిర్మించిన ఈ రామాలయంలో జరగనున్న వేడుక కోసం..ప్రధాన  పూజారులు, దాతలు, ఎంతోమంది రాజకీయ నాయకులతో సహా 6,000 మంది పైగా అతిథులకు ఆహ్వాన కార్డులు పంపబడుతున్నాయి.

జనవరి 22న జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొంటారు. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు, యూపీ ప్రభుత్వం జనవరి 2024లో  ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రధాన దేవాలయాలలో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించబోతోంది .  జనవరి 14 నుంచి 22 వరకు ఈ పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, యూపీ గవర్నెమెంట్  కలిసి వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న రామమందిరంలో శ్రీరాముని విగ్రహాన్ని  ప్రతిష్టించనున్న రోజే ఎన్నో ఉత్సవాలు నిర్వహించనున్నారు.  ఈ మహోత్సవాల సందర్భంగా శ్రీరామ చంద్రుని జీవితంలోని కీలక ఘట్టాలను తెలిపే విధంగా శోభాయాత్రను కూడా తాము నిర్వహించనున్నట్లు అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. సుమారు 100 కీలక ఘట్టాల విగ్రహాలతో అయోధ్యలో ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి గుర్తుగా.. జనవరి 17 2024న  శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

వారం రోజులపాటు జరిగే రామమందిర విగ్రహ ప్రతిష్ఠాపనా మహోత్సవాలను .. శోభాయాత్రతోనే శ్రీకారం చుట్టనున్నట్లు అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు. శ్రీరాముని జననం నుంచి వనవాసం, లంకపై విజయం, మళ్లీ అయోధ్యకు తిరిగి రావడం వంటి కీలక ఘట్టాలు తెలియజేసే విధంగా ఈ  విగ్రహాలు ఉంటాయి.  వివిధ దశల్లో మొత్తం 100 విగ్రహాలను ప్రదర్శించనుండగా.. వీటిలో ఇప్పటి వరకు 60 విగ్రహాలను సిద్ధం చేశారు.

ఇక అయోధ్య రామమందిర నిర్మాణం, అయోధ్య వివాదంపై 2019 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసినట్లు అయింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ.. ఆలయ నిర్మాణంపై నిర్ణయాలను తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర అనే ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. 2020 ఆగస్టు 5న ప్రధాని మోడీ ఆలయానికి శంకుస్థాపన చేసిన తర్వాత రామమందిర నిర్మాణం ప్రారంభమైంది.  1988లో అహ్మదాబాద్‌లోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్‌పై రామమందిర నిర్మాణం ఆధారపడింది. అయితే దీనికి 2020లో కొన్ని మార్పులు చేసి జనవరి 22 వ తేదీకి రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి..ప్రతిష్ఠాపన వేడుకను అంగరంగ వేడుకగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =