కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ట్వీట్లు తొలగించాలని ఆదేశం

Union Minister Smriti Irani Defamation Case Delhi High Court Issues Summons To Congress Leaders, Delhi High Court Issues Summons To Congress Leaders, Delhi HC Issues Summons To Congress Leaders Over Illegal Bar Claim Against Irani's Daughter, HC Issues Summons To Congress Leaders Over Illegal Bar Claim Against Irani's Daughter, Illegal Bar Claim Against Irani's Daughter, Delhi HC Issues Summons To Congress Leaders, Irani's Daughter Illegal Bar, Delhi HC issues summons to Congress leaders on Smriti Irani's Daughter defamation suit, Smriti Irani's Daughter Illegal bar case, Illegal bar case, Smriti Irani defamation suit, Delhi HC asks Congress leaders to remove social media posts, Congress leaders summoned by Delhi HC, Smriti Irani Illegal bar case News, Smriti Irani Illegal bar case Latest News, Smriti Irani Illegal bar case Latest Updates, Smriti Irani Illegal bar case Live Updates, Mango News, Mango News Telugu,

కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖెరా, నెట్ట డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల మంత్రి స్మృతి ఇరానీ వేసిన పరువునష్టం కేసులో హైకోర్టు వారికి సమన్లు పంపింది. అంతేకాకుండా స్మృతి ఇరానీ మరియు ఆమె కుమార్తెపై నిరాధార ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియా నుండి ట్వీట్లు, రీట్వీట్లు, పోస్ట్‌లు, వీడియోలు మరియు ఫోటోలను తొలగించాలని జస్టిస్ మినీ పుష్కర్ణ ముగ్గురు కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. ఒకవేళ ప్రతివాదులు 24 గంటల్లోగా తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్ మెటీరియల్‌ను తీసివేయాలని కోర్టు తెలిపింది.

అయితే కోర్టు సమన్లపై స్పందించిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్ త్వరలోనే వాస్తవాలను కోర్టు ముందు ఉంచుతామని, కేంద్రమంత్రి ఇరానీపై తాము చేస్తున్న అర్పణలను నిరూపిస్తామని వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తాము చెప్పిన విషయాలను స్మృతి ఇరానీ వక్రీకరించి చెప్పారని, ఆ విషయాలను కోర్టుకు తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్మృతి ఇరానీని తన మంత్రివర్గం నుండి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. కాగా స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన నేపథ్యంలో.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తనపైన, తన కుమార్తె పైన నిరాధార ఆరోపణలు చేశారంటూ రూ.2 కోట్లకు కాంగ్రెస్ నేతలపై సివిల్ డిఫమేషన్ కేసు వేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 12 =