ఆర్య సమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేయడం దాని బాధ్యత కాదని స్పష్టం

Supreme Court Arya Samaj Has No Right For Giving Marriage Certificate It's Invalid, Arya Samaj Has No Right For Giving Marriage Certificate It's Invalid, Arya Samaj Has No Right For Giving Marriage Certificate, Supreme Court Says Arya Samaj Marriage Certificate Is Invalid, Arya Samaj Marriage Certificate Is Invalid, Marriage Certificate Is Invalid, Arya Samaj Marriage Certificate, Marriage Certificate, Supreme Court, Mango News, Mango News Telugu,

దేశవ్యాప్తంగా ఆర్య సమాజ్‌లలో జరిగే పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఆర్య సమాజ్‌ జారీ చేసే మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించబోమని స్పష్టం చేసింది. అయినా మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేయడం ఆర్య సమాజ్‌ బాధ్యత కాదని, అది ప్రభుత్వ అధికారుల పని అని తెలిపింది. మధ్యప్రదేశ్‌లో ఒక మైనర్‌ బాలికని కిడ్నాప్ మరియు రేప్‌ నేరాలకు సంబంధించి 363, 366A, 384, 376(2)(n), 384 IPC సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిన నిందితుడిపై విచారణ చేపట్టింది. అయితే కేసు విచారణలో భాగంగా.. ఈ సందర్భంగా నిందితుడి తరపు సమర్పించిన ఆర్యసమాజ్ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రాన్ని స్వీకరించడానికి శుక్రవారం నిరాకరించింది. అనంతరం నిందితుడి బెయిల్ పిటిషన్‌ను బీవీ నాగరత్న, అజయ్ రస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.

కాగా ఆర్య సమాజ్ అనేది ఒక హిందూ సంస్కరణవాద సంస్థ. దీనిని 1875లో స్వామి దయానంద్ సరస్వతి స్థాపించారు. అప్పట్లో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునేవారికి ఇది అండగా ఉండేది. ఇతర వివాహాలతో పోలిస్తే ఆర్యసమాజ్ వివాహాలు చాలా భిన్నంగా ఉంటాయి. వారు ఇతర వివాహాల మాదిరిగా ఎటువంటి ఖర్చు, హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ వివాహ విధానాన్ని అనుసరిస్తారు. ఈ సంస్థ నియమాల ప్రకారం.. వరుడికి కనీసం 21 ఏళ్లు, వధువు వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు ఎవరైనా ఆర్యసమాజ్ వివాహ విధానాలను నిర్వహించవచ్చు. అలాగే ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు లేదా యూదులు కాని ఎవరైనా కూడా ఆర్యసమాజ్ వివాహం చేసుకోవచ్చు. వివాహం అనంతరం వధూవరులకు మ్యారేజ్ సర్టిఫికెట్ అందజేస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 7 =