ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన 4గురు వైసీపీ అభ్యర్థులు

AP Four YSRCP Candidates Unanimously Elected As Members of The Rajya Sabha, YSRCP Candidates Unanimously Elected As Members of The Rajya Sabha, Rajya Sabha, YSRCP Four Candidates Unanimously Elected As Members of The Rajya Sabha, YSRCP Four Candidates, Unanimously Elected As Members of The Rajya Sabha, AP Four YSRCP Candidates, YSR Congress Party four candidates, four Rajya Sabha seats, YSRCP candidates, Four YSRCP Candidates, Rajya Sabha Four YSRCP Candidates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలలో ఎలాంటి సంచలనాలు చోటుచేసుకోలేదు. వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో.. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్‌. కృష్ణయ్య మరియు బీద మస్తాన్‌రావులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఈమేరకు వారు ఎన్నికల అధికారి నుంచి డిక్లరేషన్‌ సర్టిఫికెట్లు అందుకున్నారు. అయితే ఈ నలుగురిలో ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం. మిగిలిన ఇద్దరూ నెల్లూరు వాసులే కావడం గమనార్హం.

బీసీ సంఘ ఉద్యమ నేతగా పేరున్న ఆర్‌. కృష్ణయ్యది వికారాబాద్ జిల్లా మొయిన్ పేట మండలం రాళ్లడుగుపల్లి గ్రామం కాగా, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా పనిచేస్తున్న నిరంజన్‌ రెడ్డిది ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణం. అలాగే అధికార వైసీపీలో కీలక నేతగా పేరున్న విజయసాయి రెడ్డిది నెల్లూరు జిల్లా తాళ్లపూడి గ్రామం కాగా, మరో అభ్యర్థి బీద మస్తాన్‌ రావు నెల్లూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. కాగా ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డికి ఇది రెండవ పర్యాయం. ఈ సందర్భంగా ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్ష మేరకు పనిచేస్తామని, తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, రాష్ట్ర అభివృద్ధి కోసం సమిష్టిగా కలిసి పని చేస్తామని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =