రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారిగా స్పందించిన క్రికెటర్ రిషభ్ పంత్

Team India Cricketer Rishabh Pant Says his Surgery was Success and Ready for the Challenges Ahead,Cricketer Rishabh Pant,Rishabh Pant Hospitalised,Rishabh Pant Accident,Rishabh Pant Accident News,Rishabh Pant Car Accident,Rishabh Pant Today News,Rishabh Pant Today News Car Accident,Mango News,Mango News Telugu,Rishabh Pant Age,Rishabh Pant And Urvashi Rautela,Rishabh Pant Century,Rishabh Pant Height,Rishabh Pant Net Worth,Rishabh Pant News,Rishabh Pant Stats,Rishabh Pant Twitter,Rishabh Pant Urvashi,Rishabh Pant Wikipedia,

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్‌ క్రమంగా కోలుకుంటున్నాడు. రిషభ్ పంత్ ప్రస్తుతం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదం తర్వాత క్రికెటర్ రిషభ్ పంత్ సోమవారం తొలిసారిగా ట్వీట్‌ చేస్తూ, ప్రమాద ఘటన, కోలుకోవడంపై స్పందించాడు. రికవరీకి మార్గం ప్రారంభమైందని మరియు రాబోయే సవాళ్లకు సిద్ధంగా ఉన్నానని రిషభ్ పంత్ పేర్కొన్నారు.

“మద్దతు మరియు శుభాకాంక్షలు తెలిపిన అందరికి నేను వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా శస్త్రచికిత్స విజయవంతమైందని మీకు తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. రికవరీకి మార్గం ప్రారంభమైంది మరియు రాబోయే సవాళ్లకు నేను సిద్ధంగా ఉన్నాను. గొప్ప మద్దతు అందించిన ఇచ్చిన బీసీసీఐ, సెక్రటరీ జై షా మరియు ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు. మీ మంచి మాటలు మరియు ప్రోత్సాహానికి నా అభిమానులు, సహచరులు, వైద్యులు, ఫిజియోలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ మైదానంలో చూడాలని ఎదురుచూస్తున్నాను” అని పంత్ పేర్కొన్నారు.

అలాగే ప్రమాద సమయంలో తనను కాపాడి ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేసిన ఇద్దరికి పంత్ కృతజ్ఞతలు తెలిపారు. “ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పలేకపోవచ్చు, కానీ నా ప్రమాద సమయంలో నాకు సహాయం చేసిన మరియు నేను సురక్షితంగా ఆసుపత్రికి చేరుకునేలా చేసిన ఈ ఇద్దరు హీరోలను నేను తప్పక గుర్తించాలి. రజత్ కుమార్, నిషు కుమార్ లకు ధన్యవాదాలు. నేను ఎప్పటికీ వారికీ కృతజ్ఞతతో మరియు రుణపడి ఉంటాను” అని రిషభ్ పంత్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =