కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 137 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination More Than 137 Cr Vaccine Doses Provided to States UTs, More than 137 Crore vaccine doses provided to States, Over 137 Cr COVID Vaccine Doses Provided To States, Over 137 cr COVID-19 vaccine doses, Over 137 cr COVID-19 vaccine doses provided to States, Over 137 crore Covid-19 vaccine, Update on COVID-19 Vaccine Availability in States

దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ, ప్రత్యక్ష రాష్ట్ర సేకరణ కేటగిరి ద్వారా ఇప్పటికి మొత్తం 137 కోట్లకుపైగా (1,37,71,08,100) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు. అలాగే అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 22.70 కోట్లకుపైగా (22,70,98,006) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

మరోవైపు దేశంలో హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతుండగా, నవంబర్ 30, మంగళవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 123.25 కోట్లు (1,23,25,02,767) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 78,80,545 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణి చేసినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + twelve =