కేంద్రప్రభుత్వం తాజాగా అన్లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో భాగంగా సినిమా థియేటర్స్, మల్టీప్లెక్సులు, క్రీడాకారులు ట్రైనింగ్ కోసం వాడే స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ అక్టోబర్ 15 నుండి తిరిగి తెరవడానికి అనుమతి ఇచ్చారు. సినిమా థియేటర్లను, మల్టీప్లెక్సులను వారి సీటింగ్ సామర్థ్యంలో 50% తో ప్రారంభించాలని సూచించారు. ఇందుకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ జారీ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu