చైనాలో తిరుగులేని నేతగా ‘జిన్‌పింగ్’, మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక

Xi Jinping Elected as President of China For The Third Time, Xi Jinping Elected China President, China President Xi Jinping, Xi Jinping China President Third Time, Third Time China President, President Xi Jinping, Mango News, Mango News Telugu, China President Xi Jinping Re-Elected For 3Rd Term, China President Xi Jinping Re-Elected, Xi Jinping Secures Third Term, Chinese President Xi Jinping, Xi Jinping Secures Historic Third Term, China Xi Secures Third Term, Xi Jinping LAtest News And Updates

చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్‌ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్టీ రాజ్యాంగ సవరణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా మరో ఐదేళ్ల పాటు జిన్‌పింగ్‌ చైనాకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల్లో ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. చైనాలో ఈ పదవికి ఎన్నికైన వారే దేశాధ్యక్ష పదవితో పాటు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి కమాండర్‌గా బాధ్యతలు చేపడతారు. ఈ క్రమంలో కాగా జిన్‌పింగ్‌ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీని కొత్తగా ప్రకటించారు. తనకు అనుకూలమైన వారిని దీనిలో సభ్యులుగా నియమించుకున్నారు. అలాగే చైనాలో సరికొత్త ప్రధాని(ప్రీమియర్‌‌)ని ఎన్నుకొన్నారు. గతంలో షాంఘైలోని చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన జిన్‌పింగ్ కు అత్యంత సన్నిహితుడైన లీ కియాంగ్‌ను ఈ ప్రీమియర్ పదవికి ఎంపిక చేయడం విశేషం.

ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అజేయ శక్తిగా మారిందని, ఈ స్థాయికి రావడానికి మేము అనుసరించిన సంస్కరణలేనని, దీనిని ఇకముందూ కొనసాగిస్తామని తెలిపారు. ప్రపంచానికి చైనా అవసరం ఉందని, దాని శక్తిని మిగిలిన దేశాలు విస్మరించలేవని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశాల్లో ఒకప్పటి అధ్యక్షుడు, బలమైన నాయకుడు అయిన హు జింటావోను అనూహ్యంగా సమావేశాలనుంచి బలవంతంగా తీసుకెళ్తున్నట్లు ఒక వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన చైనా ప్రభుత్వం, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే విశ్రాంతి కోసం ఆయనను పక్కనే ఉన్న ఒక రూముకి తరలించామని వివరణ ఇచ్చింది. మొత్తానికి జిన్‌పింగ్‌ పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =