ప్రధానిపై మనసులో ఏముందోనంటూ యడియూరప్ప హాట్ కామెంట్

Yeddyurappa hot comment on the Prime Minister,Yeddyurappa hot comment,Yeddyurappa on the Prime Minister,BS Yediyurappa discusses alliance,comment on the Prime Minister,Mango News,Mango News Telugu,Ex-CM, Ex-CM Yeddyurappa, Prime Minister, BJP, Congress, JDS,Yeddyurappa Latest News,Yeddyurappa Latest Updates,Yeddyurappa Live News,Indian Prime Minister Narendra Modi,Indian PM Narendra Modi,Narendra Modi,PM Narendra Modi, Narendra modi Latest News and Updates

ఢిల్లీలో జరిగిన భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత.. కర్ణాటక మాజీ చీఫ్ మినిష్టర్ బీఎస్. యడియూరప్ప గురువారమే బెంగళూరుకు తిరిగి వెళ్లారు.ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు అందరినీ విస్తుపోయేలా చేశాయి. సమావేశంలో జేడీఎస్‌తో పొత్తు గురించి మాట్లాడలేదని వివరించారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి కర్ణాటక రాష్ట్రంలోని నేతలంతా కట్టుబడి ఉంటారని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు.

ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత డాలర్స్ కాలనీలోని తన నివాసం దగ్గర.. విలేకరులతో కాసేపు ఆయన మాట్లాడారు. జేడీఎస్ తో పొత్తు విషయంలో డెసిషన్ తీసుకునే ముందు బీజేపీ హైకమాండ్ కర్ణాటకలోని నేతలను సంప్రదించవచ్చని బీఎస్ యడ్యూరప్ప అన్నారు. మొన్న జీ20, మధ్యప్రదేశ్ ఎన్నికల గురించి మాత్రమే చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. అంతకుమించి మరేదైనా చర్చించడానికి సమయం లేదన్న ఆయన..కర్ణాటకపై అసలు చర్చే జరగలేదని అన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తుపై కొంతమంది రాష్ట్ర నేతల అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు బీఎస్‌ యడియూరప్ప స్పందిస్తూ ఢిల్లీ నేతలే తుది నిర్ణయం తీసుకుంటారని పక్కా క్లారిటీ ఇచ్చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మనసులో దీని గురించి ఏముందో తనకు తెలియదని యడియూరప్ప తేల్చి చెప్పడంతో అక్కడి వారు కాస్తంత షాక్ అయ్యారు.

మనం చెప్పేదానికంటే ఢిల్లీ పెద్దలు చెప్పేదే ముఖ్యమన్న యడియూరప్ప .. నిర్ణయం తీసుకునే ముందు వాళ్లు మమ్మల్ని సంప్రదిస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పలేనని..పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు. ఈ విషయాన్ని హైకమాండ్ తమ సమావేశంలో ప్రస్తావించలేదని,త్వరలోనే దీనిపై పూర్తి సమాచారం తెలుస్తుందని యడియూరప్ప అన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకుంటాయని గత వారమే..యడియూరప్ప చెప్పిన విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వడానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దీనికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్ డీ. కుమారస్వామి అంగీకరించలేదనే న్యూస్ వినిపిస్తోంది.

గణేశ్ చతుర్ధి తర్వాత.. బీజేపీతో చర్చలు జరపొచ్చని ఇటీవల జేడీఎస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ హెచ్‌డీ కుమారస్వామి సూచనప్రాయంగా చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ మీద ఎలా అయినా ఈ సారి ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని జేడీఎస్‌కు చెందిన కొందరు నాయకులు అనుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొన్న ఘోర పరాజయాన్ని చవి చూసిన భారతీయ జనతా పార్టీ, జేడీఎస్ పార్టీలు పుంజుకునే ప్రయత్నం చేయడానికి పొత్తు అస్త్రాన్ని బయటకు తీశాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =