ఆ నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాక్ తింటారు..

Benefits of drinking silver charged water,Benefits of drinking,silver charged water,drinking silver charged water,Mango News,Mango News Telugu,silver charged water,silver charged water benefits,benefits, drinking water,Carcinogenic properties,silver charged water Latest News,silver charged water Latest Updates,silver charged water Live News
silver charged water,silver charged water benefits,benefits, drinking water,Carcinogenic properties

పరగడుపున రెండు గ్లాసుల నీళ్లు తాగాలని..అలా  తాగితే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతూ ఉంటారు. దీనికోసం ప్లాస్టిక్ బాటిల్స్‌లో మంచినీళ్లను కాకుండా.. రాగిచెంబులో రాత్రంతా ఉంచిన నీళ్లు తాగితే ఇంకా మంచిదని పెద్దలు కూడా అంటూ ఉంటారు.అయితే ఇప్పుడు ఈ లిస్టులోకి ఇంకో నీళ్లు కూడా వచ్చేసాయి.  ఇప్పుడంతా  సిల్వర్‌ ఛార్జ్‌డ్ నీళ్ల గురించే చెప్పుకుంటున్నారు. వీటిని తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.

దీంతో చాలామందికి సిల్వర్‌ ఛార్జ్‌డ్‌ నీళ్లంటే ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిల్వర్‌ ఛార్జ్‌డ్‌ నీళ్ల కోసం ఓ వెండి గ్లాసును కానీ జగ్గును గాని తీసుకోవాలి. దాన్ని చక్కగా శుభ్రం చేసి రాత్రి పూట అందులో మంచి నీళ్లని పోసి మూత పెట్టాలి. దీంతో వెండి లోహానికి ఉన్న ఔషధ గుణాలు..నీటితో కలిసి ఆ నీళ్లు ఛార్జ్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటినే  సిల్వర్ ఛార్జ్‌డ్‌ వాటర్‌ అంటారని.. ఉదయం లేవగానే పరగడుపున  ఈ నీటిని తాగాలని సూచిస్తున్నారు. అలాగే వీలయితే రోజంతా ఆ గ్లాసుతోనే నీళ్లను తాగుతూ ఉండాలని.. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.

రాగిలానే వెండిలో  కూడా కార్సినియోజెనిక్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కార్సినియోజెనిక్‌ లక్షణాలు శరీరంలో క్షార గుణాన్ని మెరుగుపరుస్తాయట. అంతేకాదు  సాధారణంగా క్యాన్సర్‌ కణాలు .. ఆమ్ల లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిలో వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందట. అందుకే  ఈ సిల్వర్ ఛార్జ్‌డ్‌  నీళ్లను రోజూ తాగడం వల్ల  వారికి క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.

సిల్వర్ ఛార్జ్‌డ్‌  నీళ్లను రోజూ తాగడం వల్ల వృద్ధాప్య లక్షణాలు తొందరగా రాకుండా ఉంటాయట. ఎందుకంటే సిల్వర్ ఛార్జ్‌డ్‌  నీళ్లు తాగడంతో ఈ నీళ్లు శరీరంలో కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ ఉంటాయి. అందువల్ల చర్మం ఎక్కువ కాలం పాటు మెరుస్తూ యవ్వనంగా ఉంటుందట.

అంతేకాదు గర్భం ధరించిన స్త్రీలు కూడా రోజూ ఈ నీళ్లను తాగడం వల్ల వంటి వాటినుంచి కాపాడుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే  వెండి గిన్నెలో నీటిని మరిగించి ఆ నీళ్లను  తాగొచ్చు. దీని వల్ల ఇంకా గర్భిణీలు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారట.

సిల్వర్ ఛార్జ్‌డ్‌  నీళ్లని తాగడం వల్ల శరీరం చల్లబడుతుందని నిపుణులు అంటున్నారు.అంతేకాదు ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగవుతుందట.ఈ నీళ్ల వల్ల తినే ఆహారం సక్రమంగా అరుగుతుందని..దీని వల్ల మొత్తం ఆరోగ్యం చక్క బడుతుందని  చెబుతున్నారు.

సిల్వర్ ఛార్జ్‌డ్‌  నీళ్లను రోజూ తాగడం వల్ల  రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందట. అంతేకాదు శరీరం దృఢంగా మారడంతో పాటు  వ్యాధులు కూడా తొందరగా దరి చేరకుండా ఉంటాయట. సిల్వర్ ఛార్జ్‌డ్‌  నీటిని తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వులు కూడా తేలికగా కరుగుతాయట. అంతేకాదు బరువు తగ్గాలనుకునేవాళ్లు తప్పనిసరిగా సిల్వర్ ఛార్జ్‌డ్‌ నీళ్లు కనుక తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =