తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికి 1,76,550 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. వీరిలో 109161 ప్రభుత్వ, 58,137 ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు. ఫిబ్రవరి 3, బుధవారం నాడు 10 జిల్లాల్లో 158 సెషన్స్ లో 6,689 మంది ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ కు వ్యాక్సిన్ వేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం నాడు రాష్ట్రంలోని 15,736 ప్రైవేట్ హెల్త్‌కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేసేలా లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 42.5 శాతం (6,689) మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా వ్యాక్సినేషన్ ఫిబ్రవరి 4 తేదీన కూడా కొనసాగుతుందని, ఫిబ్రవరి 5 న ముగుస్తుందని వెల్లడించారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారిలో జనవరి 19 న వ్యాక్సిన్ తీసుకున్న ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ