ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఇదే …

AP High Court, AP High Court Move to Kurnool, AP High Court Moves To Kurnool, Centre responds on shifting of AP High Court, Kurnool, Kurnool High Court, Kurnool High Court News, Mango News, Minister Ravi Shankar Prasad Responds over AP High Court Move to Kurnool, Ravi Shankar Prasad, Union Law Minister, Union Law Minister Ravi Shankar, Union Law Minister Ravi Shankar Prasad

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం నాడు రాజ్యసభలో అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలింపు అంశంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ‌ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం ఏపీ హైకోర్టు (సబ్‌ జ్యూడీస్‌) పరిధిలో ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతేడాది ఫిబ్రవరిలోనే హైకోర్టు‌ను కర్నూలుకు తరలించాలని ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.

ఈ తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులతోనే నిర్ణయం ఉంటుందని, ఒక ఏకాభిప్రాయానికి రావాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి గడువు లేదని తెలిపారు. అలాగే హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో కర్నూలులో జ్యుడిషియల్‌ రాజధాని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =