బండి సంజయ్‌ను వెంటాడుతున్న అసమ్మతి

Bandi is the discord that haunts Sanjay,Bandi is the Discord,Discord that Haunts Sanjay,Bandi sanjay, BJP, Karimnagar, Telangana bjp,Mango News,Mango News Telugu,Bandi sanjay Latest News,Bandi sanjay Latest Updates,Karimnagar Latest News,Karimnagar Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana BJP Latest News,Telangana BJP Latest Updates
Bandi sanjay, BJP, Karimnagar, Telangana bjp

తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు బండి సంజయ్. అసలు రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీని మార్చేశారు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారో.. అప్పటి నుంచి రాష్ట్రంలో పార్టీ పతనం మొదలయింది. అయితే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ.. అసమ్మతి నేతలు మాత్రం ఆయన్ను వదలడం లేదు. టార్గెట్ చేసి వెంటాడుతూనే ఉన్నారు.

తెలంగాణ బీజేపీలో సగానికి పైగా బండి సంజయ్ అంటే గిట్టని వారే ఉన్నారు. బండి సంజయ్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని.. 2018లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చిందని.. సీనియర్లను కూడా లెక్క చేయడం లేదని కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటించారు. ఈక్రమంలో అసెంబ్లీ ఎన్నికల ముంగిట పలుమార్లు బండి సంజయ్ వ్యతిరేకులంతా సమావేశమయ్యారు. అటు అసమ్మతి నేతలతో కరీంనగర్‌కు చెందిన బండి సంజయ్ వ్యతిరేకులు కూడా చేతులు కలిపారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్‌ గెలుపు కోసం వ్యతిరేకవర్గం పనిచేయలేదు.

అంతకంటే ముందు బండి సంజయ్ వ్యతిరేకులపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వారికి వార్నింగ్ కూడా ఇప్పించారు. అయినప్పటికీ అసమ్మతి నేతలు ఏమాత్రం తగ్గకుండా.. బండి సంజయ్‌పై ఇంకా రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ టికెట్ బండి సంజయ్‌కు దక్కకుండా అసమ్మతి నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ హైకమాండ్ అందరిని కాదని కరీంనగర్ టికెట్ ఆయనకే కేటాయించింది.

అయితే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో.. కరీంనగర్ టికెట్ బండి సంజయ్‌కు దక్కకుండా చేయాలని అసమ్మతి నేతలు నిర్ణయించారట. ఇందుకోసం బండి సంజయ్ వ్యతిరేకులంతా రహస్యంగా సమావేశమయ్యారట. ఆ టికెట్ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు కానీ.. బండి సంజయ్‌కు మాత్రం దక్కకుండా చూడాలని అసమ్మతి నేతలు తీర్మానించారట. ఈ విషయంపై అధిష్టానంతో మాట్లాడేందుకు త్వరలో అసమ్మతి నేతలంతా ఢిల్లీ వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారట. మరి అధిష్టానం అసమ్మతి నేతలవైపు మెగ్గు చూపుతుందా..? లేదా వీరిని కాదని బండి  సంజయ్‌కు టికెట్ ఇస్తుందా అనేది ఆసక్తి కరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =