సంతానం లేని వాళ్లకు సంతానాన్నిఇచ్చే సీతమ్మ

Sitamma Who Gives Children To The Childless, Sitamma Gives Children, Sitamma Gives Children TO Childless, Children TO Childless, Sita Temple Without Rama, Sitamma, Avani Kshetra,Avani Kshetra 100 km Away From Bangalore, Kolaru District, Karnataka State, Latest Sitha Rama News, Latest Sitha Rama News Update, Lord Sitha Rama News, Devotional Updates, Devotional News, Mango News, Mango News Telugu
Sita temple without Rama, Sitamma ,Avani Kshetra ,Avani Kshetra 100 km away from Bangalore, Kolaru District, Karnataka State.

చిన్నప్పటి నుంచి రామాయణాన్ని వింటూ, చదువుతూ పెరిగిన వాళ్లే చాలామంది ఉంటారు. సీతారాముల కళ్యాణం, ఆ తర్వాత  14 ఏళ్లు వనవాసం, శ్రీరాముని పట్టాభిషేకం ,రాముడు సీతను అడవులకు పంపడం, అక్కడ  వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి లవకుశులకు జన్మనివ్వడం, అశ్వమేధయాగ సమయంలో లవకుశులతో రామలక్ష్మణులు యుద్ధం చేయడం, అక్కడే సీతాదేవి తన తల్లి భూమాత గర్భంలో కలిసిపోవడం ఇవన్నీ అందరికీ తెలిసిందే..

రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగా చెబుతారు. దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆది కవిగాను సుప్రసిద్ధమయినారు. భారత దేశంలో సీతారాములు వెలసిన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నట్లు చరిత్ర కారులు చెబుతారు. అలాంటి ఒక క్షేత్రమే అవని క్షేత్రం అని కాకపోతే  సీతాదేవికి  మాత్రమే అంకితం చేసిన ఒక ఆలయంగా అంటారు .

ఈ ఆలయంలో శ్రీరాముడు లేకుండా సీతాదేవి ఒక్కర్తే  దర్శనం ఇస్తుంది. అవని క్షేత్రం ప్రాంతంలో రామలింగేశ్వర, లక్ష్మణేశ్వర, భరతేశ్వర, శత్రుఘ్నేశ్వర పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రఖ్యాతి గాంచిన అవని  క్షేత్రం బెంగళూరుకు దాదాపు 100 కి.మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం, కోలారు జిల్లా, ముల్‌బాగల్‌ తాలూకాలో ఉంది.

రామాయణ ఇతిహాసాన్ని రచించిన వాల్మీకి మహర్షి..అంటే  రామాయణ కాలంలో ఇక్కడే నివసించాడని పురాణాలు చెబుతున్నాయి. సీతాదేవి అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా అవని ప్రాంతంలోని ముని ఆశ్రమంలోనే నివసించిందని పురాణ పురుషులు చెబుతారు. సీతాదేవి ఇక్కడే లవకుశులకు జన్మనిచ్చిందట. నేటికీ సీతమ్మ లవకుశులకు  జన్మనిచ్చిన గది అలాగే ఉందట. అంతేకాకుండా శ్రీరాముడు, అతని కుమారులయిన లవకుశల మధ్య యుద్ధం జరిగింది  ఈ ప్రాంతంలోనే అని అంటారు.

లవకుశలతో యుద్ధం జరిగాక తమ తప్పును గ్రహించిన రామ లక్ష్మణలు తమ తప్పునకు ప్రాయశ్చిత్త మార్గం చెప్పాలని వాల్మీకి మహర్షిని ప్రార్ధించారట. అప్పుడు అక్కడ  శివలింగ ప్రతిష్ట చేయాలని వాల్మీకి సూచించారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణులు అందరూ అక్కడే  శివలింగాలు ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత పంచపాండువులు, ఆదిశంకరుల వారు వంటి వారు ప్రతిష్టించిన శివలింగాలతో ఇప్పుడు అక్కడ 101 శివలింగాలు ఉన్నాయి.

అవని ప్రాంతంలో సీతమ్మ ప్రతీ రోజూ పార్వతీదేవిని పూజించడం వల్ల, ఇక్కడ అమ్మవారిని సీతాపార్వతీ మాత అని కూడా పిలుస్తారట. అవని కొండపైన పార్వతీదేవి సాలగ్రామ విగ్రహం కూడా ఉంటుంది. అంతేకాదు లక్ష్మణుడు సీతమ్మ దప్పిక తీర్చడం కోసం ఈ ప్రదేశంలో భూమిలోకి బాణం వేయడంతో.. అక్కడ బాణాకారంలో ఒక మడుగు ఏర్పడింది అని అంటారు. అలాగే  ఆ మడుగులోని నీరు మండుటెండల్లో కూడా ఇంకిపోదని ప్రతీతి.

ఈ ఆలయాన్ని సంతానం లేని దంపతులు సందర్శిస్తే పిల్లలు పుడతారని నమ్మకం. సంతానం లేని స్త్రీలు లక్ష్మణ తీర్థంలో స్నానం చేసి, తడి బట్టలతోనే ఆ ఆలయంలో పూజలు చేస్తే  వారి కోరికలు తీరుతాయని ప్రతీతి. సంతానం కోసం ఈ ఆలయానికి వెళ్లిన భక్తులు ఒక రాత్రి అక్కడ నిద్ర చేయడం ఆనవాయితీ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =