పిఠాపురం, పాలకొల్లులో ఏదొక నియోజకవర్గం నుంచి పోటీ

Bunny Vasu Contest from Janasena,Contest from Janasena,Bunny Vasu Contest,Bunny Vasu from Janasena,A movie producer, Janasena, Contest from Pithapuram constituency , Palakollu constituency, Pawan Kalyan, Producer Bunny Vasu,Mango News,Mango News Telugu,Bunny Vasu Latest News,Bunny Vasu Latest Updates,Producer Bunny Vas,Pawan Kalyan Appoints Bunny Vasu,Janasena Latest News,Janasena Latest Updates
A movie producer, Janasena, Contest from Pithapuram constituency , Palakollu constituency, Pawan Kalyan, Producer Bunny Vasu

ప్రముఖ నిర్మాత, ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్‌లో అల్లు అరవింద్‌తో పాటు పలు చిత్రాలు నిర్మించిన బన్నీ వాసు.. చాలామందికి సుపరిచితమే. బన్నీ వాసు అసలు పేరు ఉదయ శ్రీనివాస్ అన్న విషయం మాత్రం అతని సన్నిహితులకు మాత్రమే తెలుసు.  అయితే  ఆయన ఇప్పుడు సినిమాలతో పాటు  ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఓ వార్త పొలిటికల్ అండ్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిర్మాత బన్నీ వాసుకి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.నిజానికి బన్నీవాసుకి జనసేన పార్టీతో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. జనసేన ఆవిర్భావం నుంచి కూడా బన్నీ వాసు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో ఉంటూ..  చాలా దగ్గరగా పని చేస్తూనే వస్తున్నారు. కానీ  ఎప్పుడూ  అతను పని చేస్తున్నట్టు కానీ ప్రత్యక్షంగా కానీ,   ప్రచారాల్లో కానీ విషయం బయటకు తెలియదు.

జనసేన పార్టీకి బన్నీవాసు పని చేస్తూ తన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుల్లో బన్నీవాసు ఒకరు. అంతెందుకు బన్నీవాసు వారానికి రెండు రోజులు పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన కోసమే వినియోగిస్తూ ప్రజల దగ్గర నుంచి సేకరించిన సమాచారాన్ని నేరుగా పవన్ కళ్యాణ్‌కు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారట.

ఇప్పటి వరకూ ప్రచార బాధ్యతలలో తలమునకలైన బన్నీవాసు.. రాబోయే ఏపీ ఎన్నికలలో నిలబడబోతున్నారన్న వార్త  ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.  అయితే బన్నీ వాసు తన స్వగ్రామం అయిన పాలకొల్లు నుంచి  పోటీ చేస్తారని  చాలామంది అనుకుంటున్నా కూడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో నియోజకవర్గం పేరు వినిపిస్తోంది.

అవును ఇప్పుడు సామాజిక మాధ్యమంలో మాత్రం పిఠాపురం నుంచి ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. . జనసేన, టీడీపీ పొత్తుతో ఏపీ రాజకీయాలలో కలిసి నడుస్తున్నాయి కాబట్టి, కొన్ని నియోజకవర్గాలు మారిపోతాయి. దీంతో బన్నీ వాసుకి పిఠాపురం నియోజకవర్గం వచ్చినట్టుగా చెపుతున్నారు.అయితే ఈ వార్తలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 5 =