తెలంగాణలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు

Bank Timings in Telangana, Banks, Banks in Telangana, Banks in Telangana Will Work in the Regular Timings, Banks in Telangana Will Work in the Regular Timings From Today, Mango News, Telangana Banks, Telangana Banks Change Working Hours, Telangana Banks Timing, Telangana Banks Will Work In The Regular Timings, Telangana Banks Working Hours, Telangana Banks Working Hours Timing

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు సవరించిన నేపథ్యంలో బ్యాంకుల పనివేళలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 10, గురువారం నుంచి గతంలో లాగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకు పనివేళలు యథావిధిగా కొనసాగునట్టు ఎస్‌ఎల్‌బీసీ ప్రకటించింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ముందుగా కొన్నిరోజులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే బ్యాంకులు పనిచేశాయి. అనంతరం జూన్ 1 నుంచి జూన్ 9 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేశాయి. తాజాగా ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ సడలింపులు ప్రకటించడంతో ఎప్పటిలాగానే సాధారణ సమయాల్లోనే బ్యాంకింగ్‌ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ను జూన్ 19 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ నుంచి బ్యాంకులు/ఏటీఎంలు, బీమా సేవలు మరియు సంబంధిత కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు. లాక్‌డౌన్‌ లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఇచ్చారు. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన ప్రజలు ఇళ్లకు చేరేందుకు మరో గంట పాటు అంటే సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుల పనివేళ్లలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =