ఆ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్..

BJP Focus On Those Constituencies, Focus On Those Constituencies, Telangana BJP, BJP Strategy, Lok Sabha Elections, Warangal, kammam, Nalgonda, Nagarkarnul, Mahabubnagar, BJP, Modi, Kishan Reddy, Polictical News, Mango News, Mango News Telugu
Telangana BJP , BJP strategy, BJP focus on those constituencies,Lok Sabha Elections

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోండటంతో.. బీజేపీ ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది.400లకు పైగా సీట్ల టార్గెట్‌తో ముందుకువెళుతోన్న కమలం పార్టీ.. దేశ వ్యాప్తంగా పార్టీ బలహీనంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలపై  స్పెషల్ ఫోకస్  పెట్టింది.

ఆయా నియోజకవర్గాల్లో వేరే పార్టీల నేతలను కాషాయపార్టీలో ఆహ్వానించి ,పెద్ద ఎత్తున చేరికలను  ప్రోత్సహించడానికి  కసరత్తు మొదలు పెట్టారు. తెలంగాణలో కూడా ఇప్పుడు కమలనాధులు అదే  పనిలో ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ముఖ్యంగా రిజర్వుడు, వీక్ నియోజకవర్గాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ అధిష్టానం.. తెలంగాణలో ఎక్కువ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించడానికి స్కెచ్ వేస్తోంది.

400 సీట్లకు పైగా పార్లమెంట్ సాధించాలని ఇప్పటికే పార్టీ వర్గాలకు  పార్టీ పెద్దలు.. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే, పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ పరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ.. ఈ నియోజకవర్గాల బాధ్యతలను ఇప్పటికే కేంద్ర మంత్రులకు అప్పగించింది.

దేశ వ్యాప్తంగా తమ పార్టీ ఇప్పటివరకు గెలవని, బలహీనంగా ఉన్న 160 నియోజక వర్గాలను బీజేపీ పెద్దలు గుర్తించారు. ఇందులో తెలంగాణలో కూడా 14 నియోజకవర్గాలు ఉన్నట్లు కేంద్ర పెద్దలు గమనించారు. తెలంగాణలో రిజర్వుడ్, వీక్ గా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమలనాధులు.. ఈ నియోజక వర్గాల్లో పార్టీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోతే వేరే  పార్టీల్లో ఉన్న బలమైన వ్యక్తిని తమ పార్టీలో కి తీసుకువచ్చేలా స్కెచ్ వేస్తున్నారు.

ముఖ్యంగా వరంగల్, పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ వంటి నియోజకవర్గాల్లో బలమైన నేతలను కాషాయ పార్టీలోకి తీసుకు వెళ్లడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.  అంతేకాదు ప్రస్తుత ఎంపీలను, మాజీ ఎంపీలను, ఆ నియోజకవర్గం మీద ప్రభావం చూపే వ్యక్తులపై కూడా  పార్టీ కన్నేసిందట. ఇప్పటికే ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలు కమలం పార్టీకి టచ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చేరికలతోపాటు.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటించే  దిశగా బీజేపీ వెళుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 10 =