మహబూబ్‌నగర్‌లో జనం గోస-బీజేపీ భరోసా సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

BJP National President JP Nadda Participates Janam Gosa-BJP Bharosa Public Meeting in Mahabubnagar, JP Nadda Participates Janam Gosa-BJP Bharosa Public Meeting in Mahabubnagar, Janam Gosa-BJP Bharosa Public Meeting in Mahabubnagar, Mahabubnagar Janam Gosa-BJP Bharosa Public Meeting, Janam Gosa-BJP Bharosa Public Meeting, Janam Gosa-BJP Bharosa, BJP National President JP Nadda, BJP National President Jagat Prakash Nadda, BJP National President, Jagat Prakash Nadda, JP Nadda Telangana Tour, BJP National President Jagat Prakash Nadda Two Days Tour, JP Nadda Two Days Tour, JP Nadda Two Days Tour News, JP Nadda Two Days Tour Latest News, JP Nadda Two Days Tour Latest Updates, JP Nadda Two Days Tour Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రస్తుతం రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ రెండో విడత యాత్ర ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్ర సందర్భంగా గురువారం మహబూబ్‌నగర్‌ లోని ఎంవీఎస్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ‘జనం గోస-బీజేపీ భరోసా’ పేరుతో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. ముందుగా బండి సంజయ్ మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రపై రూపొందించిన పుస్తకాన్ని జేపీ నడ్డా విడుదల చేశారు. ఈ సభలో జేపీ నడ్డాతో పాటుగా బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, డీకే అరుణ, లక్ష్మణ్‌, మురళీధర్‌రావు, జితేందర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు సహా పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

మరోవైపు మహబూబ్‌నగర్‌ చేరుకున్న అనంతరం ముందుగా బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో జేపీ నడ్డా పాల్గొని బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ముందస్తు ప్రణాళికతో నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి, పార్టీని మరింత పటిష్టం చేసి అధికారంలోకి వచ్చేలా కృషిచేయాలని పార్టీ శ్రేణులకు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానించాలని, బలమైన నేతలకు పార్టీలోకి స్వాగతం చెప్పాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో కెళ్ళి ప్రజలతో మమేకమై పనిచేసి మంచి ఫలితాలను సాధించాలని పార్టీ నాయకులకు జేపీ నడ్డా సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 5 =