గాల్వాన్ లో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించిన సీఎం కేసీఆర్

CM KCR Bihar Tour Presented Rs 10 Lakh Cheques to Each Family of Martyred Soldiers of Galwan, Kcr To Leave For Bihar On Aug 31, Kcr To Visit Bihar On Aug 31,CM KCR Financial Aid To Galwan Martyrs, Mango News, Mango News Telugu, CM KCR Latest News And Updates, CM KCR Galwan Tour, CM KCR Tour News And Live Updates, Telangana CM KCR , Trs Party, Galwan Martyrs

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం బీహార్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పాట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్ కు చెందిన జవాన్ల కుటుంబ సభ్యులకు మరియు ఇటీవల హైదరాబాద్ లోని టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందించారు. గల్వాన్ ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ ల కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపంలో సీఎం కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, బీహార్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరమరణం పొందిన జవాన్ కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ శాలువాలతో సత్కరించారు.

ఇక హైదరాబాదులో జరిగిన అగ్నిప్రమాదం లో మరణించిన సికిందర్ రామ్, దినేశ్ కుమార్, బిట్టూ కుమార్, దీపక్ రామ్, సత్యేంద్ర కుమార్, ఘటీ లాల్ రామ్, రాజేష్ కుమార్, అంకజ్ కుమార్ రామ్, ప్రేమ్ కుమార్, సిందు మహల్గార్, దామోదర్ మహల్గార్, రాజేష్ కుమార్ ల కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో కలిసి సీఎం కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, మాజీ అసెంబ్లీ స్పీకర్ పి.మధుసూదనాచారి, ఎమ్మెల్సీ మరియు రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ శ్రావణ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మరియు సీఎం కేసీఆర్ ప్రతినిధి బృందంలో భాగంగా జాతీయ రైతు సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here