తిరుపతిలో శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రి నిర్మాణ భూమిపూజలో పాల్గొన్న సీఎం జగన్

CM Jagan Inaugurates Sri Venkateswara Institute of Cancer Care and Advanced Research Hospital in Tirupati, AP CM Jagan Inaugurated Sri Venkateswara Institute of Cancer Care and Advanced Research Hospital in Tirupati, CM YS Jagan Starts Sri Venkateswara Institute of Cancer Care and Advanced Research Hospital in Tirupati, AP CM YS Jagan Launches Sri Venkateswara Institute of Cancer Care and Advanced Research Hospital in Tirupati, Sri Venkateswara Institute of Cancer Care and Advanced Research Hospital in Tirupati, SVICCAR Hospital, SVICCAR Hospital in Tirupati, CM Jagan Inaugurates SVICCAR Hospital in Tirupati, Tirupati SVICCAR Hospital, Sri Venkateswara Institute of Cancer Care and Advanced Research Hospital, Tirupati SVICCAR Hospital News, Tirupati SVICCAR Hospital Latest News, Tirupati SVICCAR Hospital Latest Updates, Tirupati SVICCAR Hospital Live Updates, AP CM YS Jagan Tirupati Tour, YS Jagan To Tour In Tirupati on May 5, AP CM YS Jagan Tirupati Tour News, AP CM YS Jagan Tirupati Tour Latest News, AP CM YS Jagan Tirupati Tour Latest Updates, AP CM YS Jagan Tirupati Tour Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, AP CM, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి గురువారం తిరుపతిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద జనవరి-మార్చి 2022 త్రైమాసికానికి మొత్తం 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి జమ చేశారు.

అనంతరం తిరుపతిలో శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రి నిర్మాణానికి జరిగిన భూమిపూజ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు అంతస్తులు, 350 పడకలుతో ఈ ఆసుప‌త్రిని నిర్మిస్తుండగా, మొత్తం 15 రకాల ప్ర‌త్యేక విభాగాల్లో చిన్నారులకు వైద్య సేవ‌లు, చికిత్స‌లు ఉచితంగా అందించనున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణ శిలాఫలకాలు సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించి, త్రీడీ నమునా పరిశీలించారు.

అలాగే తిరుపతిలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్స‌ర్ కేర్ అండ్ అడ్వాన్స్ రిసెర్చ్ ఆసుపత్రిని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఒక లక్షా 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 120 కోట్ల రూపాయల వ్యయంతో విశాలమైన భవనాలు, అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఈ క్యాన్సర్ ఆసుపత్రి కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంపూర్ణ సహకారం అందించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవ‌లు అందించే ఈ ఆసుప‌త్రిలో మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీ లాంటి క్యాన్సర్లకు వైద్యసేవలు అందించనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 13 =