ప్రముఖ నటుడు అర్జున్ చెన్నైలో నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత, ప్రత్యేక పూజలు

BRS MLC Kavitha Visits Hanuman Temple and Offered Prayers Built by Actor Arjun at Chennai Today,BRS MLC Kavitha,Visits Hanuman Temple,Offered Prayers Actor Arjun,Mango News,Mango News Telugu,Arjun Built Hanuman Temple Location,Arjun Hanuman Temple Opening Time,Arjun Hanuman Temple Chennai,Arjun Anjaneyar Temple Timings,Gerugambakkam Anjaneyar Temple Timings,Gerugambakkam Anjaneyar Temple Address,Arjun Temple Gerugambakkam,Actor Arjun Hanuman Temple In Chennai Address,Hanuman Temple In Chennai By Actor Arjun,Actor Arjun Built Hanuman Temple,Actor Arjun Hanuman Temple Address,Actor Arjun Anjaneya Temple Location,Famous Hanuman Temple In South India,Arjun Hanuman Temple In Chennai Address,Hanuman Temple Near By,Hanuman Temple Near Hampi

ప్రముఖ దక్షిణాది నటుడు అర్జున్ సర్జా చెన్నైలో నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహిస్తోన్న ఒక సదస్సులో పాల్గొనడానికి చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో ఆమె ఇటీవలే నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు అర్జున్ దంపతులు ఘనస్వాగతం పలికారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా తన స్పందనను ఇలా తెలియజేశారు.. ‘నేను ఈ రోజు చెన్నై పర్యటన సందర్భంగా ఐకానిక్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాను, అక్కడ సర్వశక్తిమంతుడికి పూజ చేసే అదృష్టం నాకు కలిగింది. ఇంతటి గొప్ప ఆలయాన్ని నిర్మించినందుకు అర్జున్ గారికి నా శుభాకాంక్షలు మరియు అభినందనలు’ అని పేర్కొన్నారు.

అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద హనుమాన్ ఆలయాల్లో ఒకటిగా నిలిచిన ఈ ఆలయాన్ని నిర్మించినందుకు నటుడు అర్జున్ సర్జాకు అభినందనలు తెలిపారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని, ఇక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి, భాష, చరిత్ర, వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని అన్నారు. ఇక ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుందని తాను విశ్వసిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కాగా రెండు రోజులు జరుగనున్న ఈ సమ్మిట్‌లో కవితతో పాటుగా తమిళనాడు మాజీ ఆర్థిక మంత్రి పి త్యాగ రాజన్, ఒమర్ అబ్దుల్లా, రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్, క్రిస్ గోపాలకృష్ణన్, ఎన్ఎస్ పార్థసారథి, రమ్య ఎస్ మూర్తి, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మరియు తమిళ సినిమా సూపర్ స్టార్ విజయ్ సేతుపతి తదితర ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =