మరో 4 నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు అమలు, సీఎం కేసీఆర్ నిర్ణయం

Chief Minister of Telangana, Dalit Bandhu, Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme News, Dalit Bandhu Scheme To 4 SC Reserved Mandals, Dalit Bandhu Scheme To 4 SC Reserved Mandals With Immediate Effect, Dalit Bandhu scheme to four mandals of Telangana, Mango News, telangana CM, Telangana CM Extends Dalit Bandhu Scheme To 4 SC Reserved Mandals, Telangana CM Extends Dalit Bandhu Scheme To 4 SC Reserved Mandals With Immediate Effect, Telangana Dalit Bandhu scheme, Telangana Rashtra Samithi, Vasalamarri

దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు యొక్క లోతు పాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్ తో పాటు దళితబంధు ను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

దీనికిగాను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =