తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం..

CM KCR Plans For Expansion of Telangana Cabinet Ahead of Assembly Elections,CM KCR Plans For Expansion of Telangana,Expansion of Telangana Cabinet,Telangana Cabinet Ahead of Assembly Elections,Assembly Elections,Mango News,Mango News Telugu,Is KCR DO Telangana Cabinet Expansion,As the assembly elections are approaching, the cabinet is also ready for expansion, assembly elections,the cabinet , CM KCR, Etala Rajender, Banda Prakas, Mahender Reddy,Telangana Cabinet Latest News,Telangana Cabinet Latest Updates,Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates

రాజకీయంలో అపరచాణుక్యుడిగా పేరుపడ్డ సీఎం కేసీఆర్ తనకు తానే సాటని మరోసారి నిరూపించుకున్నారు. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉందన్న వార్తలు వినిపిస్తుండటంతో.. ఇంకా షెడ్యూల్‌ కూడా విడుదలవక ముందే 4 నియోజకవర్గాలను పేర్లు తప్ప.. మిగిలిన 115 స్థానాలకు రేసు గుర్రాల్ని అనౌన్స్‌ చేసేశారు. దీంతో అంతా ఎప్పుడెప్పుడా అని చూసిన బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ముగిసింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇక మంత్రివర్గ విస్తరణకు కూడా రెడీ అవుతోన్నారు.

అవును.. ఈ రోజు లేదా రేపు (బుధవారం).. ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా రాష్ట్ర మంత్రి వర్గాన్ని సీఎం కేసీఆర్ విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రసుతం మంత్రివర్గంలో ఉన్న ఒక ఖాళీని భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో ఖాళీగా ఉన్న స్థానాన్ని ఇప్పుడు సీఎం కేసీఆర్ భర్తీ చేయడానికి రెడీ అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని.. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ లేదా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి ఈ అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా పార్టీ వర్గీయుల నుంచి తెలుస్తోంది.

దీనిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను.. తెలంగాణ ప్రభుత్వం సమయం అడిగినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకూ రాజ్ భవన్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఈ రెండు రోజుల్లో కానీ సమయం ఇస్తే.. వెంటనే మంత్రి వర్గ విస్తరణ ఉండదనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో రానున్న ఎలక్షన్స్‌లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో.. తాజాగా మంత్రివర్గ విస్తరణ అంశం వార్తల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటి వరకూ బండ ప్రకాష్, పట్నం మహేందర్‌ సీఎం కేసీఆర్ పరిశీలనలలో ఉన్నారు. ఈ రేసులో ముదిరాజ్ సామాజికవర్గం నుంచి బండ ప్రకాష్.. రెడ్డి సామాజికవర్గం నుండి పట్నం మహేందర్‌ రెడ్డి ఉన్నారు. అయితే ఎమ్మెల్సీలుగా ఉన్న ఈ ఇద్దరు నేతలలో మండలికి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న బండ ప్రకాష్ కొనసాగుతున్నారు.

నిన్నటివరకూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాండిచ్చేరిలో ఉన్నారు. నిన్న రాత్రే హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు గవర్నర్ మంత్రి వర్గ మంత్రి వర్గ విస్తరణకు సమయం ఇవ్వనున్నారని.. దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటే బుధవారమే ప్రమాణ స్వీకారం ఉండనునట్లుగా సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 15 =