ఓటరు జాబితాలో మీ పేరుందా లేదా? లేకపోతే సెప్టెంబర్‌ 19లోగా నమోదు చేసుకోండి..

Is Your Name in The Voter List or Not Otherwise Register Before Sep 19,Is Your Name in The Voter List,Otherwise Register Before Sep 19,Name in The Voter List or Not,Mango News,Mango News Telugu,your name in the voter list, register by September 19,votername registered, Election Commission, general elections are approaching in Telangana, right to vote, change their address,Voter List News,Voter List Latest News,Voter List Latest Updates

ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి మనకున్న ఒకేఒక ఆయుధం. అలాంటి ఓటు హక్కును డబ్బుల కోసం, మందు కోసం అమ్ముకుంటున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది.అందుకే నేతల తప్పులను ధైర్యంగా ఓటర్లు ప్రశ్నించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నత విద్యావంతుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాబోతున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతున్నారు.

ఇటు ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే మీ పేరును వెంటనే నమోదు చేయించుకోవాలని.. ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. తెలంగాణలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఇప్పటి వరకూ అసలు ఓటు హక్కులేని వాళ్లు, ఎక్కడో ఓటు హక్కు ఉండి ఇక్కడ ఉంటున్నవారు.. చిరునామా మార్చుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది.

2023 అక్టోబరు 1వ తేదీకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. దీనికోసం ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాను ఆగస్టు 21వ తేదీన ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం మార్పులు చేర్పుల కోసం సెప్టెంబర్‌ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

ఓటర్ల నమోదు, అభ్యంతరాలను స్వీకరించడానికి ఆగస్టు 26, 27, సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో గ్రామాలుతో పాటు వార్డు వార్డుల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చిన దరఖాస్తులన్నిటినీ సెప్టెంబర్‌ 28వ తేదీలోపు పరిశీలించి.. అక్టోబరు 4వ తేదీన ఫైనల్ ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ఇదే ఓటరు జాబితాతో తెలంగాణలో సాధారణ ఎన్నికలతో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అందుకే కొత్త ఓటర్ల నమోదు,మార్పులు చేర్పుల కోసం దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =