సంక్షేమపథకాల అమలులో తెలంగాణదే మొదటిస్థానం

#KCR, CM KCR, CM KCR Press Meet, CM KCR Press Meet In Dharmapuri, Dharmapuri, Kaleshwaram Project, KCR In Dharmapuri, kcr kaleshwaram project, kcr live, KCR Press Meet, KCR Press Meet In Dharmapuri, kcr speech, Mango News Telugu, political news, Political Updates, t news, telangana, Telangana CM KCR Press Meet, Telangana CM KCR Press Meet In Dharmapuri, Telangana News, Telangana Political News, Telangana Politics, telugu news

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 6న కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా, మేడిగడ్డ, సుందిళ్ల, మరియు ఎల్లంపల్లి బ్యారేజ్ లను పరిశీలించారు. తరువాత ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోదావరి జలాలను వినియోగించుకోవడం కోసం ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని చెప్పారు. 44 సంవత్సరాల సీడబ్ల్యూసీ రికార్డుల ఆధారంగా పోలవరం ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశామని, ఇంజినీర్లు, నీటిపారుదల అధికారులు ఎంతో కష్టపడి పని చేసారని సీఎం కెసిఆర్ వారిని అభినందించారు. కాళేశ్వరం నుండి 400 టిఎంసి నీటిని,ఖమ్మం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి 100 టిఎంసి నీటిని, దేవాదుల మరియు తుపాకులగుడెం జలాశయాల నుండి 75 టిఎంసి ఉపయోగించుకోవటానికి ఈ ప్రాజెక్ట్ సహాయం చేస్తుంది అని చెప్పారు. ప్రాజెక్టులన్నీ పూర్తి అయిన తరువాత తెలంగాణ 575 టిఎంసి నీటిని ఉపయోగించుకుంటుందని తెలిపారు.

భారతదేశపు అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ పై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడ జయప్రకాశ్ నారాయణ వ్యతిరేకించారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అతనికి ఏమి తెలియదని విమర్శించారు. ప్రాజెక్ట్ పై సగం జ్ఞానంతో మాట్లాడుతున్నారని, అతని వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, రైతుబంధు, రైతు భీమా పధకాలు అందరూ ఆశ్చర్యపోయేలా అమలు చేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, నీటి ఎత్తిపోయడానికి సంవత్సరానికి రూ 4,992 కోట్లు ఖర్చు మాత్రమే వస్తుందని తెలిపారు. ధర్మపురి నియోజక వర్గంలోని ప్రతి పంచాయితీకి రూ.10 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు.

 

[subscribe]
[youtube_video videoid=I_5ESfrBPE0]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 11 =