బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులపై స్పందించిన మంత్రి కేటీఆర్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు

Minister KTR Responds Over The IT Raids Today in BBC’s Delhi and Mumbai Offices,Minister KTR responded,IT attacks in the BBC offices,Key comments on BJP government,IT Department Carries Out Survey,Tax Evasion Investigation on BBC,BBC’s Delhi and Mumbai Offices,Mango News,Mango News Telugu,Bbc Documentary,Bbc Cricket India,Bbc Documentary On Modi,Bbc Hausa Indiya,Bbc Hindi,Bbc India Correspondent,Bbc India Hindi,Bbc India Weather Report,Bbc Indian Sportswoman Of The Year 2021,Bbc Indian Sportswoman Of The Year 2022,Bbc Indian Variant,Bbc Iplayer India,Bbc News,Bbc News India,Bbc News India Hindi,Bbc Sport Cricket England V India,Bbc Studios India,Bbc Urdu India,Bbc Weather India,Modi Bbc Documentary,Narendra Modi Bbc Documentary India

భారతదేశంలోని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఆఫీసుల‌పై మంగళవారం ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాలు నిర్వ‌హించింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు. ఈ మేరకు ఆయన త‌న ట్విట్ట‌ర్‌లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీబీసీపై ఐటీ రెయిడ్స్‌కు సంబంధించి వివిధ మీడియా సంస్థ‌లు రాసిన క‌థ‌నాల‌ను త‌న ట్వీట్‌లో మంత్రి ట్యాగ్ చేశారు. ఇక దీనిపై ఇలా తెలిపారు.. ‘ప్ర‌ధాని మోదీపై బీబీసీలో కొన్ని వారాల క్రితం ఒక డాక్యుమెంట‌రీ ప్ర‌సారం అయ్యింది. ఇప్పుడు భార‌త్‌లోని బీబీసీ ఆఫీసుల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వ చర్యల కారణంగా ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు న‌వ్వులపాలు అవుతున్నాయి. ఆ సంస్థ‌లు బీజేపీకి కీలుబొమ్మ‌లుగా మారాయి. దీని త‌ర్వాత ఎటువంటి చ‌ర్య‌ను తీసుకుంటారు? అదానీ స్టాక్స్‌పై నివేదిక ఇచ్చిన హిండెన్‌బ‌ర్గ్ సంస్థ‌పై ఐటీ దాడి చేయిస్తారా? లేదంటే ఏకంగా దానిని టేకోవర్ చేయడానికి ప్రయత్నిస్తారా? అని మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ఈరోజు ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో దాదాపు 15-20 మంది ఐటీ అధికారుల బృందం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ పన్నులు మరియు బదిలీ ధరల అవకతవకలకు సంబంధించిన ఆరోపణలకు సంబంధించి బీబీసీ కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. సంస్థ యొక్క వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు మరియు దాని భారతీయ విభాగానికి సంబంధించిన పత్రాలను విభాగం పరిశీలిస్తోందని వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =