సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన.. రేపు నూతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ

Telangana Cabinet First Meeting in The New Secretariat to be Held Tomorrow Chaired by CM KCR,Telangana Cabinet First Meeting,Telangana Cabinet First Meeting In The New Secretariat,Cabinet First Meeting in The New Secretariat,Mango News,Mango News Telugu,Cabinet First Meeting in The New Secretariat Tomorrow,Cabinet First Meeting,Tomorrow Cabine

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. గత నెల 30న ప్రారంభమైన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. నూతన సచివాలయం ప్రారంభించిన తర్వా త జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ ఇదే కావడం విశేషం. కాగా ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్టం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో దశాబ్ది వేడుకల నిర్వహణ మరియు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రులకు మరియు అధికారులకు సీఎం కేసీఆర్‌ కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =