ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బిజెపి శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Strongly Condemns The Attack of BJP Activists on MLC Kavitha House, Harish Rao Condemns Attack On MLC Kavitha, Mango News, Mango News Telugu, BJP Activists Attack On MLC Kavitha House, Minister Harish Rao, MLC Kavitha, Telangana Finance Minister Harish Rao, Minister Harish Rao Latest News And Updates, Minister Harish Rao Twitter Live Updates, TRS Party, Bharatiya Janata Party, MLC Kavitha News, Telangana News, MLC Kavitha House, TRS MLC Kavitha,

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడిని ఖండించారు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు. ఈ మేరకు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఎంఓటీ, మోడ్రన్ కిచెన్, దోబీ ఘాట్ల‌ను ప్రారంభించిన అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని కొంతమందికి త్వరలో సీబీఐ నో​టీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీ ఒకరు ప్రకటనలిస్తున్నారని, ఆ విషయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఆయన పార్టీకి చెందిన వారా? లేక దర్యాప్తు ఏజెన్సీకి చెందినవారా? అని నిలదీశారు. దీనిని బట్టి అర్ధమవుతోంది ఒకటే అని, దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ జేబు సంస్థలుగా మార్చేసిందని హరీష్‌ రావు విమర్శించారు.

బీజేపీ పరిపాలన మర్చిపోయిందని, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని హరీష్‌ రావు ఆరోపించారు. వారి విధానాలను వ్యతిరేకించేవారిని కుట్రపూరితంగా కేసులలో ఇరికించే ప్రయత్నాలను బీజేపీ ఒక పథకం ప్రకారం చేస్తోందని తెలిపారు. అలాగే ఎక్కడో ఢిల్లీలో జరిగిన అంశానికి ఇక్కడ రాష్ట్రంతో ముడిపెట్టి నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడటం మంచి పద్దతి కాదని అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. అయినా ఈ విషయం ప్రజలకు కూడా అర్ధమయిందని, బీజేపీ ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని ప్రజలు విశ్వసిస్తున్నారని మంత్రి హరీష్‌ రావు అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + twelve =