ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు లేనట్టేనా?

Is there no Janasena alliance with BJP in AP,Is there no Janasena alliance,Alliance with BJP in AP,Janasena alliance,Calculations ,alliances, Janasena alliance with BJP in AP,Janasena alliance, BJP,Janasena,Mango News,Mango News Telugu,Pawan Kalyans Jana Sena,Janasena alliance News Today,Janasena alliance Latest News,Janasena alliance Latest Updates,Janasena alliance Live News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Janasena Latest News
Calculations ,alliances, Janasena alliance with BJP in AP,Janasena alliance, BJP,Janasena

ఏపీలో  పొత్తుల లెక్కలతో రాజకీయ సమీకరణాలు మెల్లమెల్లగా మారిపోతున్నాయి.  మొన్నటి వరకూ బీజేపీతో దోస్తీ కట్టిన జనసేన ఇప్పుడు టీడీపీతోనే కలిసినడుస్తామని చెప్పకనే చెప్పేసింది.నిజానికి చంద్రబాబు అరెస్ట్ తర్వాత జనసేన, టీడీపీ పొత్తుల అంశం తెరమీదకు వచ్చింది. టీడపీకి అండగా ఉంటామని .. తెలుగుదేశంతోనే వచ్చే ఎన్నికల్లో  కలిసి నడుస్తామని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి బరిలో దిగుతాయని.. వైసీపీ ఒంటరి పోరాటం చేస్తుందని అంతా భావించారు. కానీ తాజాగా పవన్ మాటలతో అసలు పొత్తులో బీజేపీ ఊసు లేదని.. జనసేన, టీడీపీ మాత్రమే ఉంటున్నాయని తేలిపోయింది. దీంతో పవన్ ఒక్కసారిగా  మనసు మార్చుకోవడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎక్కడయినా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతుండటం సహజమే. ఇప్పుడు అదే సీన్ ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లోనూ కనిపిస్తోంది. తాజాగా  బీజేపీతో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో   తెగతెంపులు చేసుకున్నారన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. లాభపడిందానికంటే నష్టపోయిందే ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు సైతం బాహాటంగానే చెప్పారు. దీంతో తెలంగాణలో తమ పార్టీ ఓటమి తర్వాత  బీజేపీతో పొత్తు పెట్టుకుంటే..తనకు మరోసారి మైనస్ అవడం  తప్ప ప్రయోజనం లేదని జనసేనాని అర్ధం అయినట్లే  తెలుస్తోంది.

దీనికితోడు హైదరాబాద్‌లో డిసెంబర్ 7న  చంద్రబాబుతో భేటీ అయిన పవన్.. బాబు కూడా ఇదే చెప్పడంతో..ఇక బీజేపీతో పొత్తుకు బై చెప్పేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.  అందుకే విశాఖ  ఎంవీపీ కాలనీలోని ఎఎస్ రాజా గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో..పవన్ ఇదే విషయాన్ని తేల్చిచెప్పారు. అంతేకాదు  జనసేనను ఎట్టి పరిస్జితులలోనూ మరో పార్టీలో విలీనం చేయబోనని చెప్పారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో జనసేన కలిసి నడిచేది తెలుగు దేశంతోనే అని  క్లారిటీ ఇచ్చేసారు.

రాబోయే ఎన్నికల్లో  జనసేన మద్దతు ఇచ్చిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే.. అప్పుడు ఎవరు సీఎం అన్నది ఆలోచిద్దామని పవన్ చెప్పుకొచ్చారు. అయితే తమ పొత్తును విడగొట్టాలని కొంతమంది వైసీపీ నేతలు తమ పార్టీని.. టీడీపీ  బీ పార్టీగా చెబుతూ కామెంట్లు చేస్తున్నారని..కానీ అవేమీ  పట్టించుకోవద్దని అన్నారు. జనసేన ఎప్పుడూ కూడా టీడీపీ వెనుక నడవలేదని.. టీడీపీతో కలిసి  నడుస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పవన్  క్లారిటీ ఇచ్చారు. పనిలో పనిగా ఇదే సమయంలో పవన్ అసలు విషయాన్ని బయటపెట్టారు. జనసేన, టీడీపీలను నిండు మనసుతో గెలిపించాలని కోరారు తప్ప ఎక్కడా కూడా బీజేపీ ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో  ఇకపై బీజేపీతో పొత్తు లేదని తేల్చి చెప్పినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రతీ ఎన్నికలలో రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకున్న నేతలంతా పొత్తుల వైపే మొగ్గు చూపుతారు. అలాగే పొత్తుల సీన్ తెర మీదకు రాకముందే ఏపీలో బీజేపీతో పొత్తును పెట్టుకున్నారు పవన్. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీతో కలిసి నడుస్తామని కూడా వెల్లడించారు.  కానీ తెలంగాణలో వచ్చిన ఫలితాలతో ఎక్కడా కూడా జనసేనకు అనుకూలంగా లేకపోవడంతో.. బీజేపీతో పొత్తు కంటే పొత్తు లేకపోవడమే మంచిదని జనసేన కేడర్ భావించింది. దీంతో పాటు  టీడీపీ అధినేతతో హైదరాబాద్‌లో జరిగిన భేటీలో పవన్ ఇదే కన్ఫమ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =