తెలంగాణ చేనేత కార్మికులకు శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్.. ఈ నెల 7నుంచి ‘నేతన్న బీమా’ పథకం ప్రారంభం

Minister KTR Announces Telangana Govt To Launch Nethanna Bima Scheme For Weavers From Aug 7, Telangana Minister KTR Announces Telangana Govt To Launch Nethanna Bima Scheme For Weavers From Aug 7, KTR Announces Telangana Govt To Launch Nethanna Bima Scheme For Weavers From Aug 7, Telangana Govt To Launch Nethanna Bima Scheme For Weavers From Aug 7, TS Govt To Launch Nethanna Bima Scheme For Weavers From Aug 7, TS Nethanna Bima Scheme For Weavers, TRS Govt Nethanna Bima Scheme For Weavers, Nethanna Bima Scheme For Weavers, Weavers Nethanna Bima Scheme, Nethanna Bima Scheme News, Nethanna Bima Scheme Latest News, Nethanna Bima Scheme Latest Updates, Nethanna Bima Scheme Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణలోని చేనేత కార్మికులకు శుభవార్త. వారి కోసం త్వరలో ఒక కొత్త పథకం ప్రారంభమవనుంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతన్నల సంక్షేమం కోసం ‘నేతన్న బీమా’ పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ చేనేత దినోత్సవం రోజు (ఆగస్ట్ 7)న ఈ కొత్త బీమా పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే అమలవుతున్న ‘రైతు బీమా’ తరహాలోనే ‘నేతన్న బీమా’ పథకం కూడా కొనసాగిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద ఏదేని ప్రమాదవశాత్తు మరణించిన నేతన్నల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా పరిహారం కింద ఇస్తామని, బీమాతో నేత కార్మికుల కుటుంబాలకు భరోసా కలుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

చేనేత కార్మికులు నిత్యం మగ్గం గుంతలో కూర్చొని, బరువైన యంత్రాలను తొక్కాల్సి వస్తోందని గుర్తు చేసిన మంత్రి ఈ క్రమంలో 40 ఏళ్లకే చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుండటంతో వారి జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వారిని ఆదుకునేందుకు ఈ కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా నేతన్నల శ్రేయస్సు కోసం బీమా పథకం ప్రవేశపెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని కేటీఆర్ స్పష్టం చేశారు. 60 ఏళ్ల లోపు వయసున్న ప్రతి నేత కార్మికునికి ఈ బీమా వర్తిస్తుందని, బీమా కాలంలో చేనేత, మరమగ్గాల (పవర్ లూమ్) కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోయినట్లయితే వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందచేస్తామని తెలిపారు. పది రోజుల్లోగా ఈ బీమా మొత్తం నామినీల ఖాతాలో జమ అవుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

రాష్ట్రంలోని సుమారు 80వేల మంది నేత కార్మికులకు ‘నేతన్న బీమా పథకం’ ద్వారా లబ్ధి కలుగనుందని కేటీఆర్ ప్రకటించారు. ఇక పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని పేర్కొన్న మంత్రి కేటీఆర్‌, నేతన్న బీమా కోసం ‘లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా’ (ఎల్ఐసి)తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. అలాగే వార్షిక ప్రీమియం కోసం చేనేత కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ పథకం అమలుకోసం రూ.50 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని కూడా మంత్రి కేటీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =