తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన, ఇప్పటికే 70,02,290 మందికి కంటి పరీక్షలు

Kanti Velugu Special Response Across the State 7002290 People were Screened till Now,Kanti Velugu Special Response,Kanti Velugu 7002290 People were Screened,Kanti Velugu Screened till Now,Mango News,Mango News Telugu,Over 70 lakh eye checkups done,Telangana InFocus Phase2,Kanti Velugu,Telangana Latest News And Updates,Telangana News Today,Kanti Velugu Updates,Kanti Velugu Response News,CM KCR News And Live Updates,Hyderabad News,Telangana Kanti Velugu News,Telangana Kanti Velugu Latest Updates

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ రెండవ దశ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంతో ముఖ్యంగా పల్లెల్లో ప్రజల కళ్ళల్లో ఆనందం నెలకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 70 లక్షల 2 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ మేరకు కంటి వెలుగు కార్యక్రమ తాజా వివరాలను ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న “కంటి వెలుగు” వైద్య శిబిరాలలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారని, కేవలం ఒక్క శుక్రవారం నాడే నివేదికలను పరిశీలించగా 2 లక్షల 5 వేల 943 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని, 26 వేల కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు.

“ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రజలందరికీ కంటి పరీక్షలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ చేస్తున్నారు. కంటి వెలుగు రెండవ దశ కార్యక్రమం ఉన్నాతాధికారుల నిరంతర పర్యవేక్షణలో విజయవంతంగా కొనసాగుతున్నది. జనవరి 19వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు వైద్య శిబిరాలు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో వైద్య శిబిరాలు కళకళలాడుతున్నాయి. జిల్లా అధికారులు క్యాంపుల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. వైద్య శిబిరాలలో నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు” అని తెలిపారు.

“రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రతి వారంలో సోమవారం మొదలుకొని శుక్రవారం రోజు వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరాలు కంటి పరీక్షలు చేస్తున్నాయి. వైద్య శిబిరాల్లో ప్రత్యేక సాప్ట్ వేర్ సహాయంతో కంటి పరీక్షలు చేస్తున్నారు. డీఈఓ మరియు ఏఎన్ఎంలు ట్యాబ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు డేటా నమోదు చేస్తున్నారు. కంటి పరీక్షల తర్వాత ఆదే వైద్య శిబిరంలో అక్కడికక్కడే రీడింగ్ గ్లాసుల పంపిణీ చేస్తున్నారు. కంటి వైద్య శిబిరాల నిర్వహణపై ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నది. ప్రభుత్వ సిబ్బందికి సంబంధిత కార్యాలయాలలో, పత్రికా విలేకరులకు ఆయా ప్రెస్ క్లబ్ ల వద్ద, పోలీస్ బెటాలియన్ సిబ్బందికి వారి కార్యాలయాలలో ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70 లక్షల 02 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకుకోగా, 12 లక్షల 29 వేల 98 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పల్లెల్లో, పట్టణాల్లో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అశేష ప్రజానీకం ఉచిత వైద్యం పొందుతున్నారు” అని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + one =