ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, 8 గంటలకుపైగా ప్రశ్నించిన ఈడీ అధికారులు

Delhi Liquor Policy Case: ED Investigation of BRS MLC Kalvakuntla Kavitha Concluded,Delhi Liquor Policy Case,ED Investigation,BRS MLC Kalvakuntla Kavitha,ED Investigation of Kavitha Concluded,Mango News,Mango News Telugu,ED Lists 10 Evidences,ED grills Kavitha,Delhi Excise Case,ED Arrests Manish Sisodia After Questioning,Delhi Liquor Scam,ED Summons Telangana CMs Daughter,Delhi News Live Updates,KCRs Daughter K Kavitha Appears,BRS MLC Kavitha on ED,Telangana Will Not Bow Down,MLC Kavitha Latest News and Updates,MLC Kavitha Live Updates,Delhi Latest News,Telangana News Today,Telangana Political News And Updates,Hyderabad BusineSSman Ramachandra Pillai,Delhi News Highlights

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఉదయం ఈడీ ఎదుట విచారణకు హాజరయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో ఎమ్మెల్సీ క‌విత ఈడీ విచార‌ణ ముగిసింది. ఎమ్మెల్సీ కవితను 8 గంటలకుపైగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం, అరుణ్‌ రామచంద్ర పిళ్లైను, కవితను ఒకేసారిగా విచారించినట్టు సమాచారం. అలాగే ఆమె వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేసుకుని, మార్చి 16వ తేదీన మరోసారి ఆమెను విచారణకు రమ్మని ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఆమె శనివారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు ఈడీ కార్యాల‌యంలోకి వెళ్లగా, రాత్రి 8.15 గంట‌ల స‌మ‌యంలో బ‌య‌ట‌కు వచ్చారు. అనంత‌రం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో గల బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసంకు ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. గత మూడు రోజులుగా ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని సీఎం నివాసంలో ఉంటున్న విషయం తెలిసిందే.

మరోవైపు కవిత విచారణ నేపథ్యంలో ఢిల్లీలో సీఎం నివాసం వెలుపల ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడి ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. అలాగే ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌ రావు, క్రీడా సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ నేతలు శుక్రవారమే ఢిల్లీకి చేరుకుని, అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =