కేసీఆర్ ఖతర్నాక్ ప్లాన్..

KCR Khatarnaks plan but will it work out,KCR Khatarnaks plan,KCR plan will work out,will it work out,Mango News,Mango News Telugu,kcr, brs, formers, telangana assembly elections, Will CM KCR Plan Workout,Telangana assembly polls,Telangana polls,KCR Khatarnaks plan Latest News,KCR Khatarnaks plan Latest Update,Telangana Assembly Elections Latest Updates,Telangana Assembly Elections Live News,Telangana Latest News And Updates, Telangana Political News And Updates,Hyderabad News
kcr, brs, formers, telangana assembly elections, ec

అసెంబ్లీ ఎన్నికలవేళ.. వరుస బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

అయితే ఎన్నికల్లో రైతుల ఓట్లు చాలా కీలకం. అందుకే పోయిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు.. రైతుల రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని సంపూర్ణంగా నెరవేర్చలేదు. సరిగ్గా రుణమాఫీ చేసే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది.  అప్పటికే నిధులను రెడీ చేసి కేసీఆర్.. కొందరు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగతా రైతుల ఖాతాల్లో కూడా డబ్బులేసే సమయానికి ఎన్నికలొచ్చాయి. దీంతో రైతులందరికీ రుణమాఫీ చేయలేకపోయారు. దీంతో కొందరు రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వారిని సంతృప్తి పరిచేందుకు గులాబీ బాస్ వ్యూహాలను రచిస్తున్నారు.

రైతు రుణమాఫీ కోసం రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. త్వరలో దీనిపై కేంద్ర ఎన్నికల కమీషన్‌కు కేసీఆర్ లేఖ రాయనున్నారట. ఎన్నికల సంఘం అనుమతిస్తే వెంటనే రైతుల ఖాతాల్లో రైతు రుణమాఫీ డబ్బులు వేసేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో.. ఇందుకు ఎన్నికల సంఘం అనుమతిస్తుందా? లేదా? అనే చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =